
పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్న అక్కినేని కోడలు సమంత, సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటున్నారు. తమ వేకేషన్ ఫోటోలతో పాటు సినిమాల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. అంతేకాదు తనపై వచ్చే రూమర్స్ విషయంలోనూ సమంత ట్విటర్ వేదికగా సమాధానాలిస్తున్నారు.
ఇటీవల సమంత తల్లి కాబోతుందన్న వార్త తెలుగు మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వార్తలను ఖండించిన సామ్ ‘నిజంగానా..? మీరెప్పుడు తెలుసుకున్నారో.. నాకు కూడా చెప్పండి ప్లీజ్?’ అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం.. తాను ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు సమంత. ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment