బాలీవుడ్‌కు ‘ఓ బేబీ’! | Samantha Oh Baby Bollywood Remake | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌కు ‘ఓ బేబీ’!

Published Wed, Jul 10 2019 3:24 PM | Last Updated on Wed, Jul 10 2019 3:27 PM

Samantha Oh Baby Bollywood Remake - Sakshi

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబీ ఇటీవల విడుదలై సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కొరియన్ మూవీ మిస్‌గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తోంది. దీంతో ఓ బేబీని రీమేక్‌ చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

తెలుగులో ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన సురేష్‌ ప్రొడక్షన్స్‌ బాలీవుడ్‌ రీమేక్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నారట. బాలీవుడ్‌ నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించటంతో పాటు ఓ కీలక పాత్రలో నటించేందుకు రానా సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సమంత పాత్రకు కంగనా లేదా అలియా భట్‌ల పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.

తెలుగులో నందిని రెడ్డి దర్శకత్వం వహించగా రావూ రమేష్‌, రాజేంద్రప్రసాద్‌, లక్ష్మీ, తేజలు కీలక పాత్రల్లో నటించారు. 70 ఏళ్ల వృద్దురాళికి యవ్వనం తిరిగి వస్తే ఎలాంటి పరిణామాలు జరిగాయి. ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ ఆడియన్స్‌ను సైతం అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement