సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబీ మూవీ ఈ శుక్రవారం విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ సక్సెస్‌లో సమంతదే కీలక పాత్ర కావటంతో సినీ ప్రముఖులు, విమర్శకులు సమంతను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తన నటనతో బేబీ పాత్రకు సమంత ప్రాణపోశారంటూ తెగపొగిడేస్తున్నారు.
అయితే చార్మీ మాత్రం ఓబేబీపై విభిన్నంగా స్పందించారు. ఓ బేబీ విజయం సాధించినందుకు సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన చార్మీ ‘ఏ టైంలో పుట్టావమ్మా నువ్వు సమంతా. నీ హర్డ్ వర్క్, నీ నిర్ణయాలు ఇంకా నీ జాతకానికి ఓ నమస్కారం. నందిని రెడ్డికి ఓ బేబీ టీం మొత్తానికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన సమంత, చార్మీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
Ye time lo puttaavu Amma nuvvuu 😍🥰 @Samanthaprabhu2
— Charmme Kaur (@Charmmeofficial) 5 July 2019
Nee hard work , nee decisions and nee jatakam ki namaskaaram 🙏🏻🙏🏻🙏🏻 #samrocks #OhBabyRocks 👌🏻👌🏻
Very happy for @nandureddy4u n complete team too 🤩🙌🏻🥳
Comments
Please login to add a commentAdd a comment