‘ఒళ్లంత వెటకారం.. పుట్టింది సూర్యకాంతం’ | Samantha Oh Baby Title Song Lyrical Video | Sakshi
Sakshi News home page

‘ఒళ్లంత వెటకారం.. పుట్టింది సూర్యకాంతం’

Published Fri, May 31 2019 4:31 PM | Last Updated on Fri, May 31 2019 4:31 PM

Samantha Oh Baby Title Song Lyrical Video - Sakshi

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెండ్ సినిమా ఓ బేబీ. కొరియన్‌ సినిమా మిస్‌ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. ఇటీవల  రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

తాజాగా టైటిల్‌ సాంగ్ లిరికల్‌ వీడియోను రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్‌ సంగీతమందించిన ఈ పాటకు లక్ష్మీ భూపాల్‌ సాహిత్యం అందించారు. పార్టీ సాంగ్‌లా రూపొందించిన ఈ పాటలో. సినిమాలో సమంత క్యారెక్టరైజేషన్‌ ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ ఇచ్చేశారు. సీనియర్‌ లక్ష్మీ మరో ప్రదాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య, రావూ రమేష్‌, రాజేంద్ర ప్రసాద్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్‌, క్సాస్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement