తేజ సజ్జతో శివానీ రాజశేఖర్‌ మూవీ.. | Oh Baby Fame Teja Sajja Turns Hero | Sakshi
Sakshi News home page

తేజ సజ్జతో శివానీ రాజశేఖర్‌ మూవీ.. హీరో లుక్‌ రిలీజ్‌

Aug 23 2020 1:33 PM | Updated on Aug 23 2020 1:44 PM

Oh Baby Fame Teja Sajja Turns Hero - Sakshi

‘ఓ బేబి’ ఫేం తేజ సజ్జ, హీరో రాజశేఖర్‌ పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్‌తో హీరో, హీరోయిన్లులా ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీకి మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మహతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్నఈ మూవీ నుంచి హీరో తేజ లుక్ రిలీజైంది. ఆదివారం తేజ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి అతని లుక్ ను రివీల్ చేసారు.(చదవండి : సాయిధ‌ర‌మ్ ‌తేజ్ పెళ్లి ప్ర‌క‌ట‌న‌!)

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..‘మా మహతేజ క్రియేషన్స్ బ్యానర్ మీద ‘‘ఎస్ ఒరిజనల్స్’’ తో కలిసి ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ సినిమా నిర్మిస్తున్నాం. ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ కథ అంతా జరుగుతుంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ చెప్పిన కథకు అందరం కనెక్ట్ అయ్యాం..ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. మూవీ చాలా బాగా వచ్చింది. తేజ,శివానీ రాజశేఖర్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు..షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత మూవీని రిలీజ్ చేస్తాం’’అన్నారు. లక్ష్మీ భూపాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తులసి, శివాజీ రాజా, సత్య,మిర్చి కిరణ్,దేవీ ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement