రాజశేఖర్‌ పెద్ద కూతురితో జాంబిరెడ్డి హీరో 'అద్భుతం' | Teja Sajja, Shivani Rajasekhar Adbhutham Movie Official Trailer Released | Sakshi
Sakshi News home page

Adbhutham Trailer: రాజశేఖర్‌ పెద్ద కూతురితో జాంబిరెడ్డి హీరో 'అద్భుతం'

Published Tue, Nov 9 2021 8:31 PM | Last Updated on Tue, Nov 9 2021 8:31 PM

Teja Sajja, Shivani Rajasekhar Adbhutham Movie Official Trailer Released - Sakshi

బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన తేజ సజ్జా 'జాంబరెడ్డి' చిత్రంతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే ప్రయోగం చేసి హిట్‌ అందుకున్నాడు తేజ. కానీ తర్వాత చేసిన 'ఇష్క్‌: ఇట్స్‌ నాట్‌ ఎ లవ్‌ స్టోరీ'తో అపజయాన్ని మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు 'అద్భుతం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో హీరో రాజశేఖర్‌ పెద్ద కూతురు శివానీ హీరోయిన్‌గా నటిస్తోంది. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. ఇద్దరు వ్యక్తులకు ఒకే ఫోన్‌ నంబర్‌ ఇస్తే ఏం జరుగుతుంది? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అన్నదే కథ. ఈ ట్రైలర్‌ సినీప్రియులను ఆకట్టుకుంటోంది. అద్భుతం సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ హాట్‌స్టార్‌లో ఈ నెల 19న  విడుదలవుతోంది. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మొగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మించారు. మరి ఈ సినిమాతో తేజ హిట్‌ అందుకుంటాడేమో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement