‘నాగశౌర్య.. వాడో వేస్ట్‌ ఫెలో’ | Rajendra Prasad Intresting Speech At Oh Baby Pre Release Event | Sakshi
Sakshi News home page

‘నాగశౌర్య.. వాడో వేస్ట్‌ ఫెలో’

Published Sun, Jun 30 2019 10:29 AM | Last Updated on Sun, Jun 30 2019 10:29 AM

Rajendra Prasad Intresting Speech At Oh Baby Pre Release Event - Sakshi

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఓ బేబీ. కొరియన్‌ మూవీ మిస్‌ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ ప్రీ రిలీజ్ వేడుకను సినీ ప్రముఖులు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ ‘ఈ సినిమాలో నా పాత్ర చంటి.. యాక్చ్యువల్‌గా లక్ష్మీగారికి గానీ, సమంతకి గానీ బాయ్‌ఫ్రెండ్‌ని నేనే. ఊరికే నాగశౌర్య కాళ్లు అవి ఇరగొట్టుకొని నేను బాయ్‌ఫ్రెండ్‌ అని ఫీల్‌ అవుతుంటాడు గానీ, వాడు వేస్ట్‌ ఫెలో. ఆల్‌ రెడీ కాళు విరగొట్టుకొని వచ్చాడు కూడా’ అంటూ నవ్వులు పంచారు.

ఇదే వేదిక నుంచి సినిమా షూటింగ్ సమయంలో తనపై వచ్చిన రూమర్స్‌కు సమాధానమిచ్చారు రాజేంద్ర ప్రసాద్‌. ఓ బేబీ షూటింగ్‌ స్పాట్‌కు రాజేంద్ర ప్రసాద్‌ తాగి వచ్చారంటూ గతంలో ప్రచారం జరిగింది. ఈ వార్తలపై రాజేంద్ర ప్రసాద్‌ క్లారిటీ ఇచ్చారు. కేవలం ఆ సీన్‌కు సంబంధించిన మూడ్‌ను క్యారీ చేస్తూ సెట్‌లో అలా ఉన్నానే గానీ 42 సంవత్సరాల సినీ కెరీర్‌లో తానెప్పుడూ తాగి రావటం లాంటి పనులు చేయలేదని చేయబోనని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement