తానూ తప్పులు చేశాను అంటున్నారు నటి సమంత. ఇతర హీరోయిన్లకంటే ఈ బ్యూటీ ప్రత్యేకం అని చెప్పక తప్పుదు. వివాహానికి ముందు ఆ తరువాత కూడా కథానాయకిగా మార్కెట్‌ను నిలబెట్టుకుంటున్న నటి సమంత. కొన్ని విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ సక్సెస్ అయిన నటి ఈ అమ్మడు. మరో విషయం ఏమిటంటే నిజాలను నిర్భయంగా చెప్పే సత్తా కలిగిన నటిగానూ పేరు గాంచింది. ఇప్పటికీ హీరోయిన్ల రేస్‌లో దూసుకుపోతున్న సమంత చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం సమంత నటించిన ఓ బేబీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రానుంది.
ఈ సందర్భంగా సమంత ఒక ఇంటర్వ్యూలో తన విజయరహస్యం గురించి తెలుపుతూ అందరి మాదిరిగానే తానూ తప్పులు చేశానని చెప్పింది. అయితే ఆ తప్పుల్ని మళ్లీ దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నానని అంది. చేసిన తప్పుల నుంచి చాలా పాఠాలను నేర్చుకున్నట్లు చెప్పింది. నిజం చెప్పాలంటే తనకంటే కఠినంగా శ్రమించే వారు, ప్రతిభ కలిగిన వారు ఈ రంగంలో చాలా మంది ఉన్నారంది. అయినా కథానాయకిగా తన పయనం విజయవంతంగా సాగడానికి కారణం కథల ఎంపికనేనని చెప్పింది. దర్శకుడు కథ చెబుతున్నప్పుడే అందులో కథా పాత్రగా తాను మారిపోతానని చెప్పింది. ఈ కథలో తాను నటించగలనా? తాను అందులో నప్పుతానా? ప్రేక్షకులు ఆ పాత్రలో అంగీకరిస్తారా లాంటి ప్రశ్నలను తనకు తానే వేసుకుని ఆ తరువాతనే అందులో నటించడానికి సమ్మతిస్తానని చెప్పింది.
అయితే ఇంతకు ముందు కథల ఎంపికలో తానూ తప్పులు చేశానని, ఆ అనుభవాలను మరచిపోనని చెప్పింది. చేసిన తప్పుల నుంచి ఎదురైన గుణ పాఠాలతో పాటు, ఇతరులను గమనిస్తూ వారి నుంచి చాలా నేర్చుకున్నానని పేర్కొంది. ఇవే తన విజయ రహస్యాలని నటి సమంత తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు చిత్రాలపైనే దృష్టి సారించినట్లుంది. తమిళంలో ఇరుంబుతిరై, సూపర్‌డీలక్స్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించినా ఇప్పుడు ఇక్కడ ఒక్క చిత్రం కూడా చేతిలో లేదు. మరి తమిళ చిత్రాల అవకాశాలను ఈ అమ్మడే ఒప్పుకోవడం లేదా, లేక కోలీవుడ్‌నే దూరంగా పెట్టిందా అన్న చర్చ మాత్రం జరుగుతోంది.
నేను తప్పులు చేశాను!
Published Thu, Jun 27 2019 8:23 AM | Last Updated on Thu, Jun 27 2019 8:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment