నటిస్తారా? లేదా? | The Nayanthara starrer is hard-hitting in aaram movie | Sakshi
Sakshi News home page

నటిస్తారా? లేదా?

Nov 13 2017 12:33 AM | Updated on Nov 13 2017 12:33 AM

The Nayanthara starrer is hard-hitting in aaram movie - Sakshi

మధి... మధివధని! తమిళ సినిమా ‘ఆరమ్‌’లో నయనతార చేసిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ పాత్ర పేరు. తమిళనాట థియేటర్లలో ఇప్పుడెక్కడ చూసినా ఈ సిన్మా, అందులో నయనతార నటన గురించే డిస్కషన్‌! డేరింగ్‌ అండ్‌ డైనమిక్‌ క్యారెక్టర్‌లో ఈ హీరోయిన్‌ సూపర్‌గా నటించారని తమిళ ప్రేక్షకులు తెగ మెచ్చుకుంటున్నారు. ఈ మెచ్చుకోలు నయనకు కొత్త కాకున్నా... థియేటర్లకు వెళ్తున్నారు.

ప్రేక్షకులందరికీ థ్యాంక్స్‌ చెబుతున్నారు. ఈ సక్సెస్‌ వేడిలోనే సీక్వెల్‌ (‘ఆరమ్‌–2’) అనౌన్స్‌ చేశారు చిత్రనిర్మాత రాజేశ్‌. ట్విస్ట్‌ ఏంటంటే... ఇందులో నయనతార నటిస్తారా? లేదా? అనేది చెప్పలేదు. 2018 సెకండాఫ్‌లో ‘ఆరమ్‌–2’ను విడుదల చేస్తామని ప్రకటించారంతే. దాంతో ‘ఆరమ్‌’ సక్సెస్‌కి ముఖ్య కారణమైన నయనతార సీక్వెల్‌లో నటిస్తారా? లేదా? అనే డిస్కషన్‌ చెన్నైలో మొదలైందట. ఏమవుతుందో... వెయిట్‌ అండ్‌ సీ!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement