టైటిల్‌ దాచి కొత్త సినిమా ఆప్‌డేట్‌ ఇచ్చిన కల్యాణ్‌ రామ్‌ | NKR21: Vijayashanthi To Play Key Role In Nandamuri Kalyan Ram‌‌'s Latest Movie | Sakshi
Sakshi News home page

కల్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా.. కీలక పాత్రలో విజయశాంతి, టైటిల్‌ దాచేశారు!

Published Tue, May 28 2024 11:33 AM | Last Updated on Tue, May 28 2024 11:48 AM

NKR21: Vijayashanthi Play Key Role In Nandamuri Kalyan Ram‌‌ Latest Movie

సరిలేరు నీకెవ్వరు తర్వాత సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి మరోసారి తెరపై కనిపించలేదు. ఆ సినిమా తర్వాత పలువురు దర్శకులు తమ సినిమాల్లో నటించమని కోరినా..విజయశాంతి ఒప్పుకోలేదు. అంతేకాదు మళ్లీ తెరపై కనించబోదనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ ఈ సీనియర్‌ నటి మరోసారి తెరపై తన నటనతో ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

నేడు ఎన్టీఆర్‌ జయంతి(మే 28). ఈ సందర్భంగా కల్యాణ్‌ రామ్‌ తన కొత్త సినిమా అప్‌డేట్‌ ఇస్తూ ఓ చిన్న గ్లింప్స్‌  విడుదల చేశారు. టైటిల్‌తో పాటు కల్యాణ్‌ రామ్‌ గెటప్‌ని రివీల్‌ చేయకుండా ఈ గ్లింప్స్‌ని కట్‌ చేశారు. అయితే ఫిస్ట్‌ ఆఫ్‌  ఫ్లేమ్‌ అనే క్యాప్షన్‌ ఇచ్చి ఇదొక మాస్‌ యాక్షన్‌ సినిమా అని పరోక్షంగా హింట్‌ ఇచ్చారు. ప్రదీప్‌ చిలుకూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విలన్‌గా సోహైల్‌ ఖాన్‌ నటించగా.. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కల్యాణ్‌ రామ్‌కు తల్లిగా నటించబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement