టీఆర్ఎస్ దొంగల పార్టీ: విజయశాంతి
టీఆర్ఎస్ దొంగల పార్టీ: విజయశాంతి
Published Mon, Apr 21 2014 7:16 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
మెదక్: తెలంగాణ రాష్ట్ర సమితి, ఆపార్టీ అధినేత కేసీఆర్ పై ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ఓ దొంగల పార్టీ అంటూ విజయశాంతి మండిపడ్డారు. తన స్వార్ధమే తప్ప తెలంగాణ ప్రజల సమస్యలు కేసీఆర్ కు పట్టవని విజయశాంతి అన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆమె విమర్శించారు.
అంతేకాకుండా మాట మీద నిలబడే వ్యక్తి కేసీఆర్ కారని ఆమె అన్నారు. కేవలం కుటుంబం కోసమే కేసీఆర్ పాకులాడుతున్నారని విజయశాంతి తెలిపారు.
దళితుడిని ముఖ్యమంత్రి, ముస్లింని ఉప ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ ...ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కేసీఆర్ అధికారం కోసం పాకులాడుతున్నారని విజయశాంతి ఆరోపించారు. తెలంగాణ అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని విజయశాంతి స్పష్టం చేశారు.
Advertisement
Advertisement