సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలు కలవరపడుతుంటే కేసీఆర్ సర్కార్ తగిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. కరోనా కట్టడికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం రాష్ట్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయకపోగా.. మొదటి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం వేశామని, రెండవ డోసు 80 శాతం వేశామని అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు అమలు చేయకుండా మద్యం అ మ్మకాలతో సొమ్ము చేసుకుంటున్న సర్కార్ కరోనా నిబంధనలు గాలికొదిలేసిందని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రోజూ లక్షకు పైగా కరోనా టెస్టు లు చేయాలని హై కోర్టు మొట్టికాయ లు వేస్తే, మళ్లీ జ్వర సర్వే పేరుతో పట్ట ణ, గ్రామీణ కార్యకర్తలను పరుగులు పెట్టిస్తున్నారన్నారు. కనీసం వారికి రక్షణగా మాస్కులు, శానిటైజర్లు అందించకపోవడంతో వారు తమ సొంత డబ్బులతో కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు.
హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 10 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని రెండేళ్ల కిందట అసెంబ్లీలో స్వ యంగా వెల్లడించిన కేసీఆర్.. వాటి భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తున్నారన్నారు. ప్రజల ప్రాణాలంటే లెక్క లేని ఈ నిర్లక్ష్యపు ముఖ్యమంత్రిని రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజానీకం గద్దె దించడం ఖాయమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment