
సాక్షి, హైదరాబాద్: యథా రాజా తథా ప్రజా అన్న చందంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిస్థితి మారిందని మాజీ ఎంపీ విజయశాంతి మంగళవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికయిన ఎమ్మెల్సీలను దౌర్జన్యంగా తమ పార్టీలో కలుపుకుంటున్న సీఎం కేసీఆర్ తీరును ఆదర్శంగా తీసుకుని కొం దరు దుండగులు ప్రైవేట్ ఆస్పత్రిపై దౌర్జన్యానికి పాల్పడ్డారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మేల్కొని ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజయశాంతి డిమాండ్ చేశారు.