
విజయశాంతివి అసత్య ఆరోపణలు: కేటీఆర్
హైదరాబాద్ : టీఆర్‌ఎస్ నేతలు తన చావును కోరుకున్నారని ఆ పార్టీ మాజీ నేత, మెదక్ ఎంపీ విజయశాంతి చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే కేటీఆర్ ఖండించారు. విజయశాంతి ఆరోపణలు అన్ని అవాస్తవాలేనని ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు సరైన గుర్తింపు లేకపోవటంతో తమపై ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాము వసూళ్లకు పాల్పడితే... అందుకు ఆధారాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తనను రాజకీయంగా అణగదొక్కేందుకు టీఆర్‌ఎస్ నేతలు కుట్రపన్నారని, అడుగడుగునా ఆంక్షలు విధించారని, ఆ పార్టీ నేతలు తన చావును కోరుకున్నారంటూ విజయశాంతి నిన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే.