
'సీమాంధ్ర ఎమ్మెల్యేలు రౌడీల్లా ప్రవర్తించారు'
నంగునూరు: అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ బిల్లు ప్రతులను చింపి రాద్ధాంతం చేసిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వీధి రౌడీల్లా ప్రవర్తించారని ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. గురువారం మెదక్ జిల్లా నంగునూరులో ఆమె విలేకరులతో మాట్లాడారు.
సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ ఆగబోదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కేంద్రం ఎప్పుడో నిర్ణయించిందని, కొత్త సంవత్సరంలో ఏర్పాటు కావటం ఖాయమని చెప్పారు.