‘రాములమ్మ’కి మహేశ్‌ బర్త్‌డే విషెష్‌ | Mahesh Babu Special Birthday Wishes To Vijayashanti | Sakshi
Sakshi News home page

‘రాములమ్మ’కి మహేశ్‌ బర్త్‌డే విషెష్‌

Published Wed, Jun 24 2020 9:06 PM | Last Updated on Wed, Jun 24 2020 9:09 PM

Mahesh Babu Special Birthday Wishes To Vijayashanti - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి పుట్టిన రోజు నేడు(జూన్‌ 24). ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ‘రాములమ్మ’కు శుభాకాంక్షలు తెలియజేశారు. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సైతం విజయశాంతికి బర్త్‌ డే విషెస్‌ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్‌ డే విజయశాంతి గారు. ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యం, సంతోషం మీ వెంటే ఉండాల‌ని కోరుకుంటున్నాను’ అంటూ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ట్విటర్‌ ద్వారా విజ‌య‌శాంతికి పుట్టిన‌రోజు అభినంద‌న‌లు తెలిపారు. దీనికి ఆమె 'థ్యాంక్యూ సూపర్ స్టార్ మహేశ్బాబు గారు' అని రిప్లై ఇచ్చారు. అలాగే ‘సరిలేరు నీకెవ్వరు’ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా విజయశాంతికి బ‌ర్త్ డే విషెష్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే విజయశాంతి గారు.. మీరు నటించే సినిమాకు మీరే అతి పెద్ద ఆస్తి, బలం. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి మీరు అందించిన కృషి మాటల్లో వర్ణించలేను' అని ట్వీట్‌ చేశారు. (చదవండి : మహేశ్‌తో 'జనగణమన' నా డ్రీమ్‌)

90వ దశకంలో అగ్రతారలందరితో నటించి లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్నారు విజయశాంతి. త‌న‌దైన న‌ట‌న‌తో గ్లామ‌ర్ సినిమాలే కాదు, మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల్లోనూ న‌టించి మెప్పించారు. అప్పటి హీరోల‌కు ధీటుగా యాక్షన్‌ సినిమాల్లోనూ, విప్ల‌వాత్మ‌క చిత్రాల్లో న‌టించి మెప్పించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి, కొద్ది కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలా కాలం తర్వాత సూపర్‌స్టార్‌ మ‌హేశ్‌బాబు హీరోగా చేసిన‌‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌ తర్వాత విజయశాంతికి భారీగానే ఆఫర్లు వచ్చాయట. కానీ విజయశాంతి వేటిని అంగీకరించలేదని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement