మహేశ్‌బాబు–అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. 2020 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోందని టాక్. ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు మహేశ్. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు.
ఈ సినిమా పూర్తయిన తర్వాత అనిల్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసే ప్లాన్‌లో మహేశ్ ఉన్నారట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. అనిల్ రావిపూడి సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు మహేశ్.
చదవండి:
ఆ పాత్రలు చేసీ చేసీ బోర్ కొట్టింది
Comments
Please login to add a commentAdd a comment