
సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో విజయశాంతి భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో వెళ్లి అమిత్‌షాను కలిశారు. రేపు బీజేపీలో విజయశాంతి చేరనున్నారు. భేటీ అనంతరం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ విజయశాంతి తిరిగి మాతృ సంస్థకు చేరడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె క్రియాశీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీయేనన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ అణచివేశారని ఆయన విమర్శించారు. కుటుంబ, అవినీతి పాలనపై పోరాటం చేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా అభినందించారని ఆయన వెల్లడించారు. తాము ఆకర్ష్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని, తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయంగా ఆయన పేర్కొన్నారు. (చదవండి: బీజేపీ: ఆపరేషన్ ఆకర్ష్..)