![Sarath Kumar Intresting Comments On Vijayashanti In Ponniyin Selvan Promotions - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/27/sarath.jpg.webp?itok=esMVoaRe)
కోలీవుడ్ సీనియర్ హీరో శరత్‌కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇటీవలె పరంపర వెబ్‌సిరీస్‌తోనూ ఆకట్టుకున్నారాయన. కాగా ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో మూవీ టీం ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శరత్‌కుమార్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
'నా మొదటి సినిమా తెలుగులోనే చేశాను. విజయశాంతి మెయిన్ లీడ్‌లో నటించిన సమాజంలో స్త్రీ అనే సినిమాలో నేను కూడా నటించాను. ఆరోజు ఓ సీన్‌లో ఆర్టిస్ట్ రాలేదు. ఆ నిర్మాత నాకు ఫ్రెండ్ కావడంతో నన్ను ఆ సీన్ చేయమని అడిగాడు. కానీ నాకు యాక్టింగ్ రాకపోవడంతో చాలా టేకులు తీసుకున్నా. అప్పటికే విజయశాంతి గారు చాలా ఓపిక పట్టారు. కానీ చాలా టేకులు అవుతుండటంతో.. నేను వెంటనే చెన్నై వెళ్లిపోవాలి. కొత్తవాళ్లని తీసుకొచ్చి నా టైమ్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మంచి ఆర్టిస్టులను పెట్టొచ్చు కదా అని విసుక్కున్నారు.
అయితే కొన్నాళ్లకు నటుడిగా నేను బిజీగా ఉన్న సమయంలో ఓ సినిమాలో మళ్లీ విజయశాంతి కాంబినేషన్‌లో నటించాల్సి వచ్చింది. అప్పుడు మీరు నన్ను ఆ సినిమాలో విసుక్కున్నారు అని సరదాగా చెప్పగా అయ్యో సారీ అండీ అని చెప్పి ఫీలయ్యారు' అని అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment