
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అణిచివేయలని చూస్తున్నాడని నటి, బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. ఈ మేరకు గురువారం రాములమ్మ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై అక్రమ కేసులు పెట్టి, భయాందోళనకు గురి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నాడని మండిపడ్డారు. 2012 మహబూబ్ నగర్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు అనుమతి లేదని తనకు నాలుగు రోజుల క్రితం నాంపల్లి కోర్టు నుంచి నోటీసులు వచ్చాయన్నారు.
ఆ సభను నిర్వహించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని, కేసు పెడితే పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఆయన పైననే పెట్టాలని డిమాండ్ చేశారు. 2012లో జరిగిన ఘటనకు తొమ్మిదేళ్ల తరువాత కేసు పెట్టించడంలో ముఖ్యమంత్రి భయం అర్థం అవుతుందన్నారు. న్యాయ వ్యవస్థ పట్ల తనకు నమ్మకం ఉందని, ఆ దిశగా పోరాడుతానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎన్ని కేసులు పెట్టించినా తాను బయపడనని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment