
'మా' సభ్యురాలిని కాకున్నా ఒక కళాకారిణిగా స్పందిస్తున్నానన్నారు. ఎన్నికలపై సీవీఎల్ ఆవేదన న్యాయమైనదని వ్యాఖ్యానించారు...
సాక్షి, హైదరాబాద్: 'మా' అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన సీవీఎల్ నరసింహారావుకు నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి మద్దతు తెలిపారు. 'మా' సభ్యురాలిని కాకున్నా ఒక కళాకారిణిగా ఈ అంశంపై స్పందిస్తున్నానన్నారు. ఎన్నికలపై సీవీఎల్ ఆవేదన న్యాయమైనదని వ్యాఖ్యానించారు.
కాగా మధ్య తరగతి, చిన్న కళాకారులు, తెలంగాణ కళాకారులకు న్యాయం జరగటం కోసం పోటీ చేస్తున్నానంటూ సీవీఎల్ నరసింహారావు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. 'మా'కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రెండు విభాగాలు చేసి, రెండింటికీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.