'She's Not Superstar', Kasthuri Again Comments On Nayanthara - Sakshi
Sakshi News home page

Nayanthara: ఒక్క కామెంట్‌తో మళ్లీ హీట్‌ పెంచిన కస్తూరి

Published Sat, Aug 12 2023 11:30 AM | Last Updated on Sat, Aug 12 2023 11:39 AM

She Not Superstar Kasthuri Again Comments On Nayanthara - Sakshi

సౌత్ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన నయనతార ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండాలని కోరుకునే హీరోయిన్లలో ఒకరు. కానీ కెరీర్ ప్రారంభం నుంచి నయనతారపై గాసిప్‌లు, వివాదాలు వచ్చాయి. ప్రేమలు, ప్రేమ వైఫల్యాలు ఆమె జీవితాన్ని మార్చేశాయి. అయితే ఇన్ని సమస్యలు ఎదురైనా తన కెరీర్‌కు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. అలా 2013 తర్వాత వరుస హిట్లతో తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంది. ఎందరో నటీమణులు వచ్చినా సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదగగలిగింది మాత్రం నయనతార మాత్రమేనని ఆమెకు కితాబు ఉంది.

తాజాగ నయనతార గురించి నటి కస్తూరి చెసిన కామెంట్‌ వైరల్‌ అవుతుంది. సౌత్‌ ఇండియాలో నయనతారను లేడీ సూపర్‌స్టార్‌గా అంగీకరించలేమని కస్తూరి చెప్పింది. కోలీవుడ్‌లో రజనీకాంత్ బిగ్గెస్ట్ స్టార్. అజిత్ , విజయ్ , కమల్ హాసన్‌లు ఉన్నప్పటికీ రజనీకాంత్‌ను మాత్రం ఎవరూ భర్తీ చేయలేరని కస్తూరి అన్నారు. నటీమణుల్లో లేడీ సూపర్‌స్టార్ ఎవరు అని అడిగినప్పుడు, కస్తూరి అలనాటి నటీమణులు కెపి సుందరాంబల్, విజయశాంతి పేర్లను ప్రస్తావించింది.

ఇంతకుముందు కూడా నయనతార సరోగసీ ద్వారా బిడ్డలను స్వీకరించినందుకు కస్తూరి కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. జనవరి 2022 నుంచి భారతదేశంలో సరోగసీని నిషేధించారని, వైద్యపరంగా ఇది క్షమించరాని నేరమని కస్తూరి ట్వీట్ చేశారు. కానీ ఈ విషయంలో కస్తూరిపై విమర్శలు వచ్చాయి. మరొకరి వ్యక్తిగత జీవితంలోకి ఎందుకు చొరబడుతున్నారని కస్తూరిని పలువురు ప్రశ్నించారు. అప్పుడు ఈ విషయం కూడా పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు మళ్లీ కస్తూరి వ్యాఖ్యలపై నయనతార ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. 

(ఇదీ చదవండి: ఆరుదైన ఫీట్‌ చేరుకున్న రాధిక శరత్‌కుమార్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement