సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, సినీ నటి విజయశాంతి పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆదివారం ట్వీట్ చేశారు. తెలంగాణలో బీజేపీ బలపడిందంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల్లో కొందరిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రలోభపెట్టి, మరికొందరిని భయపెట్టి టీఆర్ఎస్‌లోకి తీసుకున్నారని, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి పార్టీలో కి ఫిరాయింపులు చేయించారని రాములమ్మ ఆరోపించారు. కాంగ్రెస్‌ను బలహీనపరచడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్‌కు.. ఇప్పుడు బీజేపీ సవాలు విసిరే స్థాయికి వచ్చిందని అన్నారు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్‌కు వర్తిస్తుందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా మాణిక్కం ఠాగూర్ మరికొంత ముందుగా వచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు మెరుగ్గా ఉండేవని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని కాలం, ప్రజలే నిర్ణయించాలని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment