
Comedian Sudharshan Says Sorry To Sunny And Kajal Fans: బిగ్‌బాస్ రియాలిటీ షోలో వీకెండ్ ఎపిసోడ్స్ మరింత స్పెషల్‌గా ఉంటాయన్నది తెలిసిందే. సండే(నవంబర్21)ఫండేగా సాగిన ఎపిసోడ్‌లో 'అనుభవించు రాజా' టీం సందడి చేసింది. హీరోహీరోయిన్లు రాజ్ తరుణ్, కౌశిష్, నటుడు నెల్లూరు సుదర్శన్ కాసేపు హౌస్‌మేట్స్‌తో చిట్‌చాట్ చేసి అందరినీ సరదాగా నవ్వించారు. అయితే అంతవరకు బాగానే ఉన్నా కాజల్-సన్నీల రిలేషన్‌ను తప్పుబడుతూ సుదర్శన్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.
వీరిద్దరి గేమ్‌పై అప్పటివరకు సరదాగా పంచులేసిన సుదర్శన్..'చివర్లో కాజల్ మీరు అలిగినప్పుడు చాలా బాగుంటుంది. సన్నీ వచ్చి ఓదార్చడం..అదో టైప్ రొమాన్స్ బాగుంది'.. అంటూ నోరుజారాడు. దీంతో షాక్ అయిన సన్నీ.. మాది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే సన్నీ-కాజల్‌ల రిలేషన్‌పై తప్పుగా మాట్లాడినందుకు కమెడియన్ సుదర్శన్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
ఫ్రెండ్స్‌లా ఉన్న వాళ్లు మీకు రొమాన్స్ చేస్తూ ఎప్పుడు కనిపించారు? అయినా సినిమా ప్రమోషన్స్‌కి వచ్చి ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం సన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న సుదర్శన్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు.
'మేం చాలా మాట్లాడుకున్నాం. కానీ ఎడిటింగ్ వల్ల కేవలం 5నిమిషాలే చూపించారు. కాజల్-సన్నీ రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. బయటకు వచ్చిన వీడియో వల్ల నెగిటివ్‌గా అనుకుంటున్నారు. సన్నీ ఫ్యాన్స్, కాజల్ ఫ్యామిలీకి క్షమాపణలు చెబుతున్నా' అంటూ వీడియో రిలీజ్ చేశాడు సుదర్శన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment