ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
Published Tue, Aug 9 2016 8:01 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసు కున్న సంఘటన మంగళవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ తాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం పీర్జాదిగూడ పార్వతీనగర్‌లో నివసించే జోగు సుదర్శన్(41) అనిత భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. సుదర్శన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. గతంలో పోచారంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో ఆర్థికంగా నష్టపోయాడు.
అప్పులు వాళ్లు అడగడంతో తీవ్ర మనస్థాపం చెందిన సుదర్శన మంగళవారం తెల్లవారు జామున 4.30 గంటలకు సీలింగ్ ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకున్నాడు. తరువాత ఇది గమనించిన అనిత స్థానికుల సహకారంతో తాడు తొలగించి కిందకు దించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. వెంటనే మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement