- మరో ఇద్దరి ఆత్మహత్యాయత్నం
సాక్షి, నెట్‌వర్క్ : పింఛన్ రాలేదనే బెంగతో కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
వివరాలు.. కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం అంకంపల్లె గ్రామానికి చెందిన పెర్క అక్కెమ్మ(70), రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండలేమూర్ గ్రామానికి చెందిన పల్లె లింగయ్య గౌడ్(70), మెదక్ జిల్లా కొండపాకకు చెందిన నల్ల బాల్‌రాజు (55), పెద్దశంకరంపేట మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన సంగన్నగారి సుదర్శన్ (75)పింఛన్ రాకపోవడంతో మనోవేదనతో మృతి చెందారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడికి చెందిన నక్క కేతవ్వ అనే వికలాంగురాలు, హుస్నాబాద్ మండలపరిషత్ కార్యాలయం ఎదుట మరో వికలాంగురాలు అజ్మీర మారోమి పింఛన్ రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.