కల నిజమైందనిపిస్తోంది | Amitabh Bachchan is timeless: Chitrangda Singh | Sakshi
Sakshi News home page

కల నిజమైందనిపిస్తోంది

Published Tue, Dec 3 2013 4:54 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కల నిజమైందనిపిస్తోంది - Sakshi

కల నిజమైందనిపిస్తోంది

ముంబై: ‘పెహలే ఆప్ జనాబ్’ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సరసన నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది నటి చిత్రాంగద సింగ్. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. నగరంలో ఆదివారం రాత్రి జరిగిన యాంబీవ్యాలీ ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నటి చిత్రాంగద సింగ్ తరుణ్ తహిల్యానీ రూపొందించిన ఎర్ర లెహంగాతో నడి చింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘స్క్రీన్ ఐడాల్ సరసన నటించే అవకాశం నాకు రావడంతో చిన్ననాటి కల నిజమైందా అనిపిస్తోంది.మితాబ్‌బచ్చన్‌కు అంత సమయం ఉండదు. చిన్ననాటినుంచే నాకు ఆయన స్క్రీన్ ఐడాల్. నాకు ఈ విషయం ఎంతో ఉల్లాసం, ఉత్సాహంగా కలిగించింది. 
 
వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ ఆరంభమవుతుంది’ అని చిత్రాంగద తెలిపింది. ‘పెహలే ఆప్ జనాబ్’ సినిమాలో చిత్రాంగద గురువు సుధీర్ శర్మ కూడా నటిస్తున్నాడు. గతంలో హజారోం ఖ్వాయిషే ఐసీ, యే సాలీ జిందగీ, ఇన్కార్ సినిమాలలో వీరిరువురూ కలసి పనిచేశారు. ‘సుధీర్ ఓ మేధావి. ఆయన స్క్రిప్టులు కూడా విభిన్నంగా ఉంటాయి. ఆయన చిత్రాల్లో పాత్రలు వాస్తవాలకు బాగా దగ్గరగా ఉంటాయి. ఆయన తన సినిమాల్లో మహిళలను శక్తిమంతులుగా రూపొందిస్తారు’ అని పేర్కొంది. కాగా కార్పొరేట్ వ్యవస్థలో మహిళలపై లైంగిక వేధింపులే ఇతివృత్తంగా మిశ్రా గతంలో ఇన్కార్ సినిమా తీశారు. తరుణ్ తేజ్‌పాల్ కేసుపై మీ అభిప్రాయమేమిటని మీడియా అడగా ఏమిజరిగిందనే విషయం సరిగ్గా తనకు తెలియదంది. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement