
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా కుమారుడు, మిజోరాం ఆటగాడు అగ్ని చోప్రా అరుదైన ఘనత సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తన తొలి నాలుగు మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా అగ్ని చోప్రా ప్రపంచ రికార్డు సాధించాడు. రంజీ ట్రోఫీ-2024లో భాగంగా మేఘాలయాతో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలతో చెలరేగిన చోప్రా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ ఏడాది సీజన్‌తో రంజీల్లోకి అరంగేట్రం చేసిన చోప్రా.. సిక్కింతో తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులు చేసిన అగ్ని, రెండో ఇన్నింగ్స్‌లో 92 పరుగులు సాధించాడు. అనంతరం నాగాలాండ్, అరుణాచాల్ ప్రదేశ్‌పై సెంచరీలతో కదం తొక్కాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు తన ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ సెంచరీతో మెరిశాడు.
ఈ ఏడాది రంజీ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన చోప్రా.. 767 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఈ మధ్యే 12th ఫెయిల్ మూవీతో భారీ విజయం అందుకున్న విధు వినోద్ చోప్రా ఇప్పుడు పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు.
చదవండి: Mayank Agarwal: ఆ బాటిల్ తీసుకుని తాగగానే వాంతులు.. భయంకర పరిస్థితి
Comments
Please login to add a commentAdd a comment