ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా తనయుడు అగ్ని చోప్రా దేశవాలీ క్రికెట్‌లో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నాడు. గతేడాది రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చిన అగ్ని.. తానాడిన మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ ఘనత ఎవరూ సాధించలేదు. అగ్ని తాజాగా ఆడిన రంజీ మ్యాచ్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. రంజీల్లో మిజోరంకు ప్రాతినిథ్యం వహించే అగ్ని.. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ, డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. దేశవాలీ క్రికెట్‌లో ఇలా ఒకే మ్యాచ్‌లో సెంచరీ, డబుల్ సెంచరీని ఇంతవరకు ఎవరూ చేయలేదు.
అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులు చేసిన అగ్ని.. రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగులు చేశాడు. అగ్ని సూపర్ శతకాలతో చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో మిజోరం 267 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అగ్నికి ప్లేయర్ ఆప్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
గత సీజన్‌లోనూ పరుగుల వరద పారించిన అగ్ని
అగ్ని గత రంజీ సీజన్‌లోనూ పరుగుల వరద పారించాడు. అగ్ని ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీల సాయంతో 939 పరుగులు చేశాడు. అగ్ని సగటు 78.25గా ఉంది. అతని స్ట్రయిక్‌రేట్ 103.30గా ఉంది. కాగా, అగ్ని తండ్రి విధు వినోద్ చోప్రా గతేడాది "12 ఫెయిల్" అనే సూపర్ హిట్ సినిమాకు దర్శకత్వం వహించాడు. అగ్ని తల్లి అనుపమ చోప్రాకు బాలీవుడ్‌లో మూవీ క్రిటిక్‌గా మంచి పేరుంది.
చదవండి: ఓవర్ వెయిట్..! టీమిండియా ఓపెనర్‌కు ఊహించని షాక్?
Comments
Please login to add a commentAdd a comment