విధూ వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ‘షికారా’ మూవీని నిలిపి వేయాలంటూ కశ్మీర్‌కు చెందిన కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. షికారాకు వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ హైకోర్టులో మంగళవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేయబడింది. 1980, 90 లలో వలస వెళ్లిన కశ్మీర్ పండితుల గురించే సాగేకథ ఆధారంగా విధు వినోద్ చోప్రా షికారా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన సాదియా, ఆదిల్ ఖాన్ షికారాతోనే తెరంగేట్రం చేసయనున్నారు. కాగా విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమాపై కోర్టులో పిటిషన్ నమోదవడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది.(సినిమాను మా అమ్మకు అంకితం చేస్తున్నా: డైరెక్టర్)
ఈ విషయంపై తాజాగా విధూ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘ఈ విషయాన్ని మా లీగల్ టీం చూసుకుంటుంది. శికారా సినిమాను అడ్డుకుంటూ కొంతమంది కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు మీడియా ద్వారా తెలిసింది. దీనిపై ఇంకా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. మా లాయర్ హరీష్ సల్వే దీని గురించి తగిన చర్యలు తీసుకుంటాడు’ అని తెలిపారు. కాగా కశ్మీర్ పండితుల గురించి అసత్యాలను చిత్రీకరించారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. సినిమాను నిలిపివేయాలని, సినిమాలో ముస్లింలను చెడుగా చూపించే కొన్ని సన్నివేశాలను తొలగించాలని కోరుతున్నట్లు పిల్ దాఖలు చేసిన వారిలో ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment