సాక్షి, హైదరాబాద్: నగరంలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను అధికారులు శనివారం కూల్చివేస్తున్నారు. మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువులో దాదాపు మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు ఫిర్యాదు కూడా అందింది. ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు మధ్యలో ఎన్ కన్వెన్షన్‌ను అధికారులు నేలమట్టం చేస్తున్నారు.
గతంలో ఏం జరిగిందంటే?
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న హయాంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరగాయి. కానీ అక్కడిదాకా వెళ్లిన బుల్డోజర్లు దాన్ని టచ్ చేయకుండానే వెనుదిరిగాయి. అప్పటినుంచి ఈ భవనం జోలికి ఎవరూ వెళ్లలేదు. అయితే ఆ కట్టడాన్ని నేలమట్టం చేసి చెరువును పునరుద్ధరించాలని స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన హైడ్రా ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేస్తోంది.
చదవండి: బిగ్‌బాస్ 8లోకి అమృత ప్రణయ్?
Comments
Please login to add a commentAdd a comment