
బిగ్‌బాస్ షో ప్రారంభం కావడానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. ఈపాటికే కొందరు కంటెస్టెంట్లు షాపింగ్ పూర్తి చేసి ఇంట్లోకి ఎప్పుడెప్పుడు వెళ్దామా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరికొందరేమో తమ పేర్లింకా ఫైనలైజ్ కాకపోవడంతో బిగ్‌బాస్ టీమ్ నుంచి కన్ఫర్మేషన్ కాల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి హౌస్‌లోకి యూట్యూబర్ అమృత ప్రణయ్ వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది.
బిగ్‌బాస్‌లో ఎంట్రీ?
తాజాగా దీనిపై అమృత స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అందరూ బిగ్‌బాస్ గురించే అడుగుతున్నారు. అమ్మ అయితే బిగ్‌బాస్‌కు వెళ్తున్నావా? నేను ముందే ప్రిపేర్ అవుతాను.. చెప్పు అని అడిగింది. బయట వచ్చిన వార్తలను అంతా నిజమని నమ్మేశారు. కానీ, నాకసలు బిగ్‌బాస్ టీమ్ నుంచి ఎటువంటి పిలుపు అందలేదు. అలాంటప్పుడు నా పేరు బయటకు ఎలా వచ్చిందో తెలియడం లేదు. ఇప్పుడైతే నేను బిగ్‌బాస్‌కు వెళ్లడం లేదు. భవిష్యత్తులో ఆఫర్ వస్తే అప్పటి పరిస్థితిని బట్టి ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చింది.

కదిలిస్తే ఏడ్చేలా ఉన్నా..
యూట్యూబ్‌లో ఎక్కువ యాక్టివ్‌గా ఉండకపోవడం గురించి మాట్లాడుతూ.. నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను. ఎన్ని పనులున్నా చేయబుద్ధి కావడం లేదు. ఇంతకుముందు కూడా కొన్ని నెలలు ఇలాగే అనిపించింది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇది డిప్రెషనో, కాదో కూడా తెలీట్లేదు. ఎలా ఉన్నావని ఎవరైనా పలకరిస్తే చాలు ఏడ్చేస్తానేమోనని భయంగా ఉంది. ఈ మానసిక స్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాను అని పేర్కొంది.
ఎవరీ అమృత?
కాగా అమృత ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమె తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో అమృత భర్త ప్రణయ్‌ను 2018లో హత్య చేయించాడు. ఆ సమయంలో అమృత గర్భిణి. హత్య కేసులో 7 నెలలపాటు జైల్లో ఉన్న మారుతీ రావు 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment