మొన్న బిగ్‌బీ.. నేడు మాధురీ దీక్షిత్: అవే షేర్స్ కొంటున్న సెలబ్రిటీలు | Madhuri Dixit Invests Rs 1 5 Crore in Swiggy | Sakshi
Sakshi News home page

మొన్న బిగ్‌బీ.. నేడు మాధురీ దీక్షిత్: అవే షేర్స్ కొంటున్న సెలబ్రిటీలు

Published Thu, Sep 19 2024 3:41 PM | Last Updated on Thu, Sep 19 2024 4:38 PM

Madhuri Dixit Invests Rs 1 5 Crore in Swiggy

ప్రముఖ నటి 'మాధురీ దీక్షిత్' (Madhuri Dixit) ఇటీవల ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీలో రూ. 1.5 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ షేర్లను ఇన్నోవ్8 వ్యవస్థాపకులు 'రితేష్ మాలిక్' నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

మాధురీ దీక్షిత్, రితేష్ మాలిక్ ఇద్దరూ రూ. 3 కోట్ల విలువైన షేర్స్  కొనుగోలు చేసి స్విగ్గిలో వాటాదారులయ్యారు. వీరిరువురు ఒక్కో షేరుకు రూ. 345 చొప్పున చెల్లించినట్లు సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కాగా ఇప్పటికే స్విగ్గిలో అమితాబ్ బచ్చన్ కూడా ఇన్వెస్ట్ చేసారు.

ఇదీ చదవండి: వాటా కొనుగోలు చేసిన బిగ్‌బీ కుటుంబం

బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్విగ్గీ.. త్వరలోనే ఐపీఓకు రానుంది. ఈ ఐపీఓ ద్వారా సుమారు ఒక బిలియన్ డాలర్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. అయితే ఈ ఐపీఓకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ ఆదాయం 36 శాతం పెరిగి రూ. 11,247 కోట్లకు చేరుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement