
హోలీ (Holi2025) పండుగ అంటే ఉల్లాసం, ఉత్సాహం. పిల్లాపెద్దా అంతా అందంగా ముస్తాబవుతారు. ఇంద్రధనుస్సు లాంటి రంగులతో ఆటలాడుకుని తమ జీవితాలు మరింత రంగులమయం శోభిల్లాలని కోరుకుంటారు. రంగు రంగుల రంగులు, గులాల్ చల్లుకొని హోలీ ఆడతారు. ఇక సెలబ్రిటీలయితే అందంగా ముస్తాబై తమ అభిమానులను అలరిస్తారు. రంగుల పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి వయసుతో పని ఏముంది అని నిరూపించారు బాలీవుడ్ హీరోయిన్లు. వారెవరో చూసేద్దామా.
2025 హోలీ కోసం సాంప్రదాయ చీరలో మాధురి దీక్షిత్ ( Madhuri Dixit ) ప్రశాంతకు చిహ్నమైన పచ్చని రంగులో అందంగాముస్తాబైనారు. తొమ్మిది గజాల అద్భుతంలో ఆకుపచ్చ రంగులో మాధురి యంగ్ అండ్ ఎనర్జటిక్‌గా కనిపించారు. 57 ఏళ్ల ఈ బాలీవుడ్ స్టార్ పండుగ కళతో ఉట్టిపడుతూ దేవతలామెరిపించింది.చీర అంటే గుర్తొచ్చే సెలబ్రిటీలలో మాధురి ఒకరు అనడంలో ఎలాంటి సందేహంలేదు. డిజైనర్ జయంతి రెడ్డి రూపొందించిన చీరకు వెండి జర్డోజీ ఎంబ్రాయిడరీ స్వీట్‌హార్ట్ నెక్‌లైన్, జుట్టుగా చక్కగా ముడి వేసుకకొని తన సిగ్నేచర్ లుక్‌కు మరింత వైభవాన్ని జోడించారు.
చదవండి: Holi 2025 Celebrations: యంగ్ హీరోయిన్ల ఫ్యావరేట్ కలర్స్ ఇవే!

సెలబ్రిటీ స్టైలిస్ట్, సుకృతి గ్రోవర్ మాధురి ఎథెరియల్ లుక్‌ను వజ్రాలు, పచ్చలు నిండిన మహారాణి నెక్లెస్, చెవిపోగులు, ఇతర ఆభరణలతో ఎథ్నిక్ లుక్‌కు మెరుపు వచ్చేసింది. గ్లామర్ విత్ ట్రెడిషన్ మాధురి షేర్ చేసిన ఫోటోలను ఇన్‌స్టాలో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి.
చదవండి: Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా!

తగ్గేదెలే అంటున్న రవీనా
నాకేం తక్కువ అంటూ ఈ హోలీకి వచ్చేశారు మరో సీనియర్ నటి, 52 ఏళ్ల రవీనా టాండన్ (Raveena Tandon). 90ల కాలంలో ఒక వెలుగు వెలిగిన ఈ అందమైన దివా , ఈ హోలీకి బ్యూటీ ట్రీట్‌ను అందించింది. తన అందమైన కళ్ళతో హోలీకి రంగుల కళను తీసుకొచ్చింది. ఇద్దరు బిడ్డలతల్లి, రవీనా దేశీ స్టైల్ గ్లామ్‌లో మహారాణిలా కనిపించింది. గోధుమరంగు డ్రెస్‌కు, పింక్ కలర్ దుప్పట్టాను జోడించింది. సొగసైన ఝుంకాలు ఆమె లుక్‌నుమరింత ఎలివేట్ చేశాయి. హోళికా దహన్ శుభాకాంక్షలు అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment