ravina tandon
-
'శిల్పాశెట్టి స్థానాన్ని భర్తీ చేయలేను..ఆమెలా మరొకరు చేయలేరు'
Shilpa Shetty: హీరోయిన్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా తీరుతో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది. క్రికెట్ బెట్టింగ్ మొదలు ఇప్పటిదాకా రాజ్‌కుంద్రా చేసిన పనుల వల్ల పరోక్షంగా శిల్పాశెట్టినే ఎక్కువ నిందలు భరించింది. తాజాగా పోర్నోగ్రఫీ కేసులో భర్త అరెస్ట్ కావడం శిల్పాను కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పటిదాకా తలెత్తిన ఆటుపోట్లు ఒకటైతే, కుంద్రా అరెస్ట్ అంతకు మించి అన్నట్లుగా ఉంది. ఓవైపు కేసుకు సంబంధించి పోలీసుల విచారణ జరుగుతుండగానే, పలువురు హీరోయిన్లు సహా సొంత ఉద్యోగులే రాజ్‌కుంద్రాపై లైంగిక ఆరోపణలు చేస్తుండటం శిల్పాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఇంటి నుంచి బయటకు కాలు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. రాజ్‌కుంద్రా వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిల్పా ప్రస్తుతం జడ్జిగా ఉన్న సూపర్ డ్యాన్సర్ రియాలిటీ షో నుంచి తాత్కాలికంగా వైదొలిగింది. గత మూడు సీజన్స్‌లోనూ జడ్జిగా ఉన్న శిల్పా ప్రెసెన్స్ షోకు మరింత కలిసొచ్చిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. షో పాపులర్ అయ్యేందుకు శిల్పా కూడా ముఖ్య పాత్ర పోషించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమె తిరిగి జడ్జిగా వ్యవహరిస్తారా లేదా అన్నది సందేహమే. దీంతో శిల్పా స్థానంలో జడ్జిగా ఉండాలంటూ హీరోయిన్ రవీనా టాండన్‌ని షో ప్రతినిధులు సంప్రదించారని సమాచారం. అయితే ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిన రవీనా.. శిల్పాశెట్టిలా మరొకరు చేసుకోలేరని అభిప్రాయపడిందట. అందుకే శిల్పా స్థానాన్ని తాను రీప్లేస్ చేయలేనని చెప్పేసినట్లు బీటౌన్ టాక్. -
రవీనా ఆగయా
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కేజీయఫ్ ఛాప్టర్ :2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తోంది. ‘కేజీయఫ్’ చిత్రం తొలి భాగం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. రెండో భాగంలో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రవీనాటాండన్ ‘రమికా సేన్’ అనే పాత్రలో కనిపించబోతున్నారు. సినిమాలో ఆమె పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఈ ఏడాది జూలైలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ∙రవీనా, ప్రశాంత్ నీల్ -
‘దిల్ దివానే’ను దించేశారు..
-
సేమ్ టు సేమ్ దించేశారు!
సాక్షి, ముంబై: బాలీవుడ్ ప్రేమకథా చిత్రాల్లో ‘మై నే ప్యార్ కియా’కు ప్రత్యేకమైన స్థానం ఉంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ జోడిగా నటించిన ఈ చిత్రం ఆబాల గోపాలాన్ని అలరించిన విషయం తెలిసిందే. 28 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడమే కాకుండా.. ఆ దశాబ్దంలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ప్రేమకథా చిత్రంతోనే చాక్లెట్ బాయ్ ఇమేజ్‌తో ‘ప్రేమ్’గా అమ్మాయిల గుండెల్లో సల్మాన్ చెరగని ముద్ర వేశాడు. ఈ సినిమాలోని ‘దిల్ దివానే’ పాట చాలా పాపులర్ అయింది. తాజాగా ఓ జంట ఈ పాటను అనుకరిస్తు చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాటలోని సాహిత్యానికి అనుగుణంగా ఈ జంట చేసిన అభినయం అందరినీ ఆకట్టుకుంటోంది. తనకు కూడా ఈ వీడియో నచ్చిందని పేర్కొంటూ నటి రవీనా టాండన్ తన ట్విటర్ పేజీలో షేర్ చేశారు. ఇంటర్నెట్లో ఈ వీడియో చూసి బాగా ఆస్వాధించినట్టు పేర్కొన్నారు. అయితే ఈ వీడియో ఎప్పటిది, ఎక్కడిది అన్న వివరాలు వెల్లడి కాలేదు. -
భర్త క్షేమం కోరి...
కర్వా చౌత్... ఉత్త రాదిన పాటించే ఆచారం ఇది. కర్వా చౌత్ నాడు భర్త ఆయురారో గ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడిని చూశాక భోజనం చేస్తారు. హిందీ పరిశ్రమలో ప్రతి ఏడాదీ ఉపవాసం ఆచరించి, పూజలు చేసే తారలు చాలామందే ఉన్నారు. గురువారం కర్వా చౌత్ సందర్భంగా కొందరు తారలు ఉపవాసం ఉన్నారు. తన భార్య జయా బచ్చన్ ఉపవాసం ఉన్న విషయాన్ని అమితాబ్ ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. గతంలో తామిద్దరూ దిగిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో తాను కనిపించకుండా జయబాధురి కనిపించేట్లు ఫొటో పెట్టి, ‘బెటర్ హాఫ్. మిగతా సగం ఇక్కడ అనవసరం. అందుకే కనిపించడంలేదు’’ అని సరదాగా అన్నారు. అనిల్ కపూర్ తాను పరిగెడుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘‘ఇన్నేళ్లుగా నువ్వు (భార్య సునీతను ఉద్దేశించి) చూపిస్తున్న ప్రేమ, చేస్తున్న పూజలు, ఆచరిస్తున్న ఉపవాసాలే నన్ను వేగంగా పరిగెత్తేలా చేస్తున్నాయి. ప్రతిరోజూ నేను ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాయి. హ్యాపీ కర్వా చౌత్’’ అని పేర్కొన్నారు. ‘‘ఉపవాసం కోసం అంతా సిద్ధం చేసుకున్నాను. కొందరు కనిపించని, ఎప్పటికీ కలవని దేవుళ్ల కోసం ఉపవాసం ఉంటారు. కానీ నేను బతికి ఉన్నవాళ్ల కోసం చేస్తుంటాను. నా జీవితాన్ని ఆనందమయం చేసిన నా తల్లిదండ్రులు, నా భర్త, ఇంకా ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆనందం కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అన్నారు రవీనా టాండన్. ఫిట్నెస్కి బాగా ప్రాధాన్యం ఇచ్చే శిల్పా శెట్టి.. ఉపవాసం ఉంటున్న వాళ్ల కోసం ‘లౌకీ కీ ఖీర్’ అనే పోషకాలు ఉన్న స్వీట్‌ని ఎలా తయారు చేయాలో చెప్పారు. సొరకాయతో ఈ ఖీర్ తయారు చేస్తారు. ప్రతి ఏడాదీ కర్వా చౌత్‌ని బాగా చేసుకుంటారు శిల్పా శెట్టి. ఈ ఏడాది కూడా ఫాస్టింగ్ ఉన్నారు. బార్సిలోనాలో శ్రియ పండగ చేసుకున్నారు. గత ఏడాది మార్చిలో రష్యాకి చెందిన వ్యాపార వేత్త ఆండ్రీ కొషీవ్ని ఆమె పెళ్లాడారు. ‘‘అందరికీ కర్వా చౌత్ శుభాకాంక్షలు. మా అమ్మగారిని మిస్ అవుతున్నాను. అయితే పండగ సందర్భంగా తను పంపించిన ‘గోటా పట్టి’ చీర కట్టుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రియ. ఇంకా షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ కూడా భర్త కోసం ఉపవాసం ఉన్నారు. ఇలా గురువారం తారల డిజైనర్ శారీస్, నగలతో ఉత్తరాదిన కర్వా చౌత్ సందడి కనిపించింది. ఇంకో విషయం ఏంటంటే...పండగ సందర్భంగా ‘దబాంగ్ 3’లో సోనాక్షీ సిన్హా లుక్‌ని విడుదల చేశారు. మామూలుగా కర్వా చౌత్ రోజున జల్లెడ లోంచి చంద్రుడ్ని చూస్తారు. ఈ లుక్ కూడా అలానే ఉంది. సో.. సినిమాలో భర్త సల్మాన్ ఖాన్ కోసం సోనాక్షీ కర్వా చౌత్ ఆచరించే సీన్ ఉంటుందన్న మాట. జయా బచ్చన్ ఆండ్రీ, శ్రియ -
అమ్మమ్మ కాబోతున్న అందాల నటి!
ముంబై : బాలీవుడ్ నటి రవీనా టాండన్ మరోసారి అమ్మమ్మ కాబోతున్నారు. ఆమె దత్త పుత్రిక ఛాయా టాండన్ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ క్రమంలో రవీనా... ఛాయా సీమంతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రవీనా కూతురు రాషా తడాని ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రవీనా స్నేహితురాలు పూజా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ అమ్మమ్మ కాబోతున్నందుకు శుభాకాంక్షలు! చాలా మంది నిస్వార్థమైన ప్రేమ గురించి మాట్లాడతారు. కానీ నువ్వు ఆ భావాన్ని ఆస్వాదిస్తూ ఆదర్శంగా నిలిచావు. దత్త పుత్రిక సీమంతాన్ని ఎంతో శ్రద్ధగా, ప్రేమగా జరిపావు. రాషా నువ్వు చాలా గొప్పదానివి. అంతేకాదు సూపర్ మాసీ(పిన్ని)వి అనిపించుకుంటావు కూడా. నిన్ను చూసి గర్విస్తున్నా రవీనా’ అంటూ క్యాప్షన్ జతచేశారు. ఈ క్రమంలో రవీనా అందాల నటి మాత్రమే కాదు... గొప్ప మనసున్న తల్లి కూడా అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా హిందీ చిత్రసీమలో హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో రవీనా టాండన్ కజిన్ ఒకరు అకస్మాత్తుగా మరణించారు. దీంతో ఆమె ఇద్దరు ఆడపిల్లలు పూజా(11), ఛాయా(8) అనాథలయ్యారు. ఆ సమయంలో వారి పరిస్థితి చూసి చలించిపోయిన రవీనా తన 21 ఏళ్ల వయస్సులో వారిద్దరిని దత్తత తీసుకుని తల్లిగా మారారు. తన ఇంటికి తీసుకొచ్చి కన్న కూతుళ్లలాగే పెంచారు. ఈ నేపథ్యంలో పిల్లల కారణంగా తన పెళ్లి విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ఎవరైనా రవీనాను ప్రశ్నించినపుడు...‘ ఇద్దరు అమ్మాయిలకు తల్లిగా ఉన్న నాకు పెళ్లవుతుందా లేదా అని చాలా మంది బాధ పడేవారు. ఎక్స్ట్రా లగేజ్‌తో అత్తారింటికి వెళ్తావా అని ఆటపట్టించేవారు. అవును.. నాతో పాటు నా ఇద్దరు పిల్లలు, కుక్కపిల్లలు కూడా ప్యాకేజీలా మీ ఇంటికి తీసుకువస్తాను మా ఆయన అనిల్ తడానికి చెప్పాను. అదృష్టవశాత్తూ ఆయనతో పాటు మా అత్తింటి వాళ్లు కూడా ఇందుకు సంతోషంగా ఒప్పుకొన్నారు. నా దత్త పుత్రికలను ఎంతో ప్రేమగా చూస్తారు’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అదే విధంగా...‘ మనసుంటే మార్గం ఉంటుంది. ప్రతీ ఒక్కరు దత్తత తీసుకుని బాధ్యనంతా మీద వేసుకోవాల్సిన పనిలేదు. మీ దగ్గర వంద రూపాయలు ఉంటే వాటిలో కనీసం ఓ 20 రూపాయలు అనాథ శరణాలయాలకు దానం ఇవ్వండి. కేవలం ఐదు రూపాయలకే దొరికే మధ్యాహ్న భోజనం కోసం వేచి చూసేవాళ్లు ఎందరో ఉన్నారు. మీ డబ్బుతో వాళ్ల ఆకలి తీర్చవచ్చు అంటూ విఙ్ఞప్తి చేశారు. ఇక 2004లో వ్యాపారవేత్త అనిల్ తడానిని పెళ్లి చేసుకున్న రవీనాకు కూతురు రాషా(14)తో పాటు కుమారుడు రణ్‌బీర్(12) సంతానం. ఇక దక్షిణాఫ్రికాలో నివసించే రవీనా పెద్దకూతురు పూజ కూడా తల్లయ్యారు. అయితే ఛాయకు పుట్టబోయే బిడ్డతోనే తనకు మొదటి నుంచీ అనుబంధం ఎక్కువని రవీనా చెప్పుకొచ్చారు. View this post on Instagram Cheers to the 'Nani to be'! Many preach unselfish love but @officialraveenatandon you practice it with true passion. Was so touching to see you celebrate the baby shower of your adopted baby with such perfection and care. And @officialrashathadani you were the such a great host, compere and I'm sure a super 'masi to be' So so proud of you Ravs. A post shared by PM (@poojamakhija) on Sep 6, 2019 at 5:54am PDT -
టిప్ టిప్.. భలే ఉంది స్టెప్
ప్రభాస్.. ఇప్పుడు నేషనల్ క్రష్. ‘బాహుబలి’తో దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. లేడీ ఫ్యాన్స్ అయితే చెప్పే పని లేదు. మరి ప్రభాస్ చిన్నప్పటి క్రష్ ఎవరో తెలుసా? రవీనా టాండన్. మరి ఆమెతో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం వస్తే ప్రభాస్‌కి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఆ చాన్స్ రానే వచ్చింది. దీనికి కారణం ‘సాహో’ చిత్రం. ఈ నెల 30న చిత్రం విడుదల కానున్న సందర్భంగా సౌత్, నార్త్‌లో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది ‘సాహో’ టీమ్. ఇందులో భాగంగా రవీనా టాండన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న ఓ హిందీ షోలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ పాల్గొన్నారు. రవీనా నటించిన సూపర్ హిట్ సాంగ్ ‘టిప్ టిప్ పానీ బరసా’ పాటకు ఈ షోలో ప్రభాస్ స్టెప్పేశారు. అలాగే రవీనా చీర కొంగుని నోటితో పట్టుకొని సల్మాన్ ఖాన్ ‘కిక్ 2’ సినిమాలోని ‘జుమ్మేకీ రాత్ హై’ పాటకు కూడా స్టెప్పులు వేశారు. -
ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్-2..సంజూనే కదా?!
ముంబై: సినీ చరిత్రలో కేజీఎఫ్ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లు కొల్లగొట్టి సినిమా పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్.. కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాక ప్రపంచ చలన చరిత్రలో రికార్డుల మోత మోగించింది. ఈ సినిమా దెబ్బకు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జీరో సీనిమా సైతం కలెక్షన్లు లేక వెలవెలబోయింది. ప్రస్తుతం కేజీఎఫ్ సీక్వెల్ గురించి అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో అధీరా పోస్టర్‌ను హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ విడుదల చేసింది. కేజీఎఫ్ మొదటి భాగంలో యష్ ముఖ్య పాత్రను పోషించగా సీక్వెల్లో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్లో సైతం కేవలం వెనక భాగం చూపెట్టడం ద్వారా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ సంజయ్ దత్ అని సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే సంజయ్ దత్, రవీన్ టాండన్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. -
జైరా వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం
న్యూఢిల్లీ: ఇస్లాంకు దూరం కావడం ఇష్టంలేక సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ‘దంగల్’ సినిమా నటి జైరా వసీమ్ ప్రకటించడం సినీ, రాజకీయవర్గాల్లో దుమారం లేపింది. కొందరు జైరా వసీమ్ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం తప్పుపడుతున్నారు. తన జీవితం గురించి ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు జైరాకు ఉందనీ, దాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జైరా వ్యక్తిగత నిర్ణయాన్ని తాము గౌరవిస్తామనీ, మతానికి–కళకు ఏమాత్రం సంబంధం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. ఇస్లాం అసహనంతో కూడిన మతం అనేలా జైరా వ్యాఖ్యలు ఉన్నాయని శివసేన నేత ప్రియాంకా చతుర్వేది విమర్శించారు. అన్నీ ఇచ్చిన సినీపరిశ్రమకు కొందరు రుణపడి ఉండరనీ, అలాంటివాళ్లు తమ మ్రౌనంగా వెళ్లిపోవడం మంచిదని నటి రవీనా టాండన్ అన్నారు. -
ఇండస్ట్రీ నాకు తగదు; కేవలం రెండు సినిమాలకే..
‘కేవలం రెండు సినిమాల్లో నటించిన వారు ఇండస్ట్రీకి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఎలాంటి నష్టం లేదు. అన్నీ ఇచ్చిన ఇండస్ట్రీ నుంచి కృతఙ్ఞతా భావంతో వెళ్లిపోతే బాగుంటుంది. పరిశ్రమపై వారి దురభిప్రాయాలను వారితో అంటిపెట్టుకుంటేనే బాగుంటుంది’ అంటూ బాలీవుడ్ నటి రవీనా టాండన్.. జైరా వసీమ్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ‘దంగల్’ సినిమాలో ఆమిర్ ఖాన్ కుమార్తె పాత్రలో కనిపించిన జైరా... సినిమాల నుంచి తప్పుకొంటున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు..‘ ‘‘ఐదేళ్ల క్రితం నేను తీసుకున్న నిర్ణయం (యాక్టర్‌గా మారాలని) నా జీవితాన్ని మార్చేసింది. ఎంతో ప్రేమను, అభిమానాన్ని ఇచ్చింది. ఈ ఇండస్ట్రీకి నేను తగినదాన్ని అయినా ఇండస్ట్రీ నాకు తగదనిపిస్తోంది.. నా ప్రశాంతతను కోల్పోయే పని చేయదలుచుకోలేదు.. అందుకే ఇండస్ట్రీ నుంచి వైదొలగాలనుకుంటున్నాను’’ అని ట్విటర్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో జైరా వ్యాఖ్యలపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం మతం కారణంగా లేదా మరే ఇతర కారణాల వల్లనో ఇండస్ట్రీలో అవకాశాలు చేజారవని, కేవలం ప్రతిభ కారణంగానే ఇక్కడ నిలదొక్కుకోగలుగుతారని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఖాన్ల త్రయంతో పాటు వహీదా రెహమాన్, నర్గిస్, షబానా అజ్మీ, జీనత్ వంటి ఎంతోమంది ముస్లిం నటీనటులు ఇండస్ట్రీలో అగ్రపథాన నిలిచారని.. వారెవరికీ రాని ఇబ్బందులు జైరాకే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన నటి రవీనా టాండన్..‘ ఇండస్ట్రీని ఎల్లవేళలా ప్రేమిస్తాను. ప్రతీ ఒక్కరికి ఎన్నో అవకాశాలు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్లిపోవడం అనేది వ్యక్తిగత నిర్ణయం. అయితే వెళ్లేముందు.. మన ప్రతిభ నిరూపించుకునేందుకు అవకాశమిచ్చిన ఇండస్ట్రీని కించపరిచేలా మాట్లాడటం సరైంది కాదు. ఇక్కడ అందరూ కలిసే పనిచేస్తారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా అంతా భుజం భుజం కలిపి పనిచేస్తారు’ అని జైరా తీరును విమర్శించారు. ఇక మరికొంత మంది మాత్రం తన జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు జైరాకు ఉందని.. ఆమెను విమర్శించేందుకు మీరెవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఈ విషయంపై స్పందించారు. ‘ జైరా వసీం నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు మీరెవరు? తనకు సంతోషాన్నిచ్చే పనులనే తను చేస్తుంది. తను ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. I standby and love my industry,all the opportunities it gives to everyone. Exit is your choice,reason,by all means.Just do not demean it for everyone else.The industry where all work shoulder to shoulder,no differences,caste,religion or where you come from. #Respect #indianfilms https://t.co/hRJKTfI9J8 — Raveena Tandon (@TandonRaveena) June 30, 2019 -
కన్నడకు కమ్‌బ్యాక్
‘కేజీయఫ్’ చాప్టర్ 1 దేశవ్యాప్తంగా సూపర్ సక్సెస్ సాధించడంతో, సెకండ్ పార్ట్‌ను ఇంకా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్టున్నారు చిత్రనిర్మాతలు. బాలీవుడ్ తారలను కూడా తారాగణంగా తీసుకొని మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. ఆల్రెడీ సంజయ్‌దత్‌ను ముఖ్యపాత్ర కోసం సంప్రదించిన విషయం తెలిసిందే. లేటెస్ట్గా రవీనా టాండన్‌ను కూడా ఓ కీలకపాత్రలో నటించమని కోరారట ‘కేజీయఫ్’ బృందం. మరి ఈ రోల్‌కు రవీనా యస్ అంటారో నో అంటారో తెలియాలి. 1999లో ఉపేంద్రతో చేసిన ‘ఉపేంద్ర’ రవీనా టాండన్ చివరి కన్నడచిత్రం. మరి 20 ఏళ్ల తర్వాత కన్నడకు కమ్‌బ్యాక్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. ఇంతకీ ‘కేజీయఫ్’లో నటించిన యశ్‌కు బోలెడంత పాపులార్టీ వచ్చిన విషయం తెలిసిందే. చిత్రదర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం రెండో భాగం పనులతో బిజీగా ఉన్నారు. -
అందుకే వెనుకంజ
కుటుంబానికే తొలి ప్రాధాన్యం: రవీనా టండన్ న్యూఢిల్లీ: రవీనా టండన్ పెళ్లి తర్వాత చాలా తక్కువ సినిమాల్లో నటించింది. కెరీర్ కంటే ఇల్లు, పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఎప్పుడో ఓసారి సినిమాలవైపు చూస్తోంది. వయసులో ఆమెకంటే పెద్దవారైనప్పటికీ మిగతా నటీమణులు వరుస సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నారు. కానీ రవీనా మాత్రం వారితో సమానంగా సాగలేక పోతోంది. ఎందుకు? ఇదే విషయాన్ని ఆమెవద్ద ప్రస్తావించినప్పుడు.... ‘సినిమాల్లో నటించడానికి నాకు తొందరేం లేదు. అనిల్ థదానీని పెళ్లి చేసుకున్నాక నా జీవితం పూర్తిగా మారిపోయింది. పిల్లలు పుట్టాక కెరీర్ వెనక్కు వెళ్లిపోయింది. ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు. మరో ఇద్దరిని దత్తత తీసుకున్నాం. భర్త, ఇల్లు, పిల్లలు.. ఈ జీవితం ఎంతో సంతృప్తికరంగా ఉంది. నా ఇష్టంతోనే కెరీర్‌ను పక్కనపెట్టాను. ఇంటికి, పిల్లలకు దూరం చేసే కెరీర్ నాకొద్దు అనిపించింది. అయినా సినిమాల్లో నటించడానికి తొందరేం లేదు. నా కుటుంబంతో గడపడానికి తగినంత సమయం లభించే ప్రాజెక్టులను మాత్రమే అంగీకరిస్తున్నాను. అందుకే మిగతావారితో పోలిస్తే పెళ్లి తర్వాత చాలా తక్కువ సినిమాల్లో నటించాన’ని చెప్పింది. డిస్ట్రిబ్యూటర్ థదానీని పెళ్లి చేసుకున్నాక పెహచాన్: ద ఫేస్ ఆఫ్ ట్రూత్, శాండ్విచ్, బుడ్డా హోగా తేరే బాప్, శోభనా 7 నైట్స్ వంటి కొన్ని సినిమాల్లో మాత్రమే రవీనా కనిపించింది. అయితే ఇవేవీ కూడా పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయాయి. అందుకు కారణం ఈ సినిమాలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉండి, వాణిజ్య విలువలు లేకపోవడమేనన్నది సినీ విశ్లేషకుల అభిప్రాయం. శోభనా 7 నైట్స్ సినిమా కమర్షియల్‌గా నిర్మాతను ఇబ్బంది పెట్టినా పలు చిత్రోత్సవాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకొని దర్శకుడికి మంచిపేరు తెచ్చింది. అయితే పెళ్లికి ముందు రవీనా సక్సెస్ఫుల్ నటిగా నిరూపించుకుంది. అందాజ్ అప్నా అప్నా, చోటేమియా బడే మియా, ఘర్వాలీ-బాహర్వాలీ, ఆంటీ నంబర్ 1, బాంబే వెల్వెట్ వంటి చిత్రాలు రవీనాకు మంచి పేరే తెచ్చాయి. తెలుగులో ఆమె నటించిన బంగారు బుల్లోడు మంచి వసూళ్లనే రాబట్టింది.