
జైరా వసీమ్
న్యూఢిల్లీ: ఇస్లాంకు దూరం కావడం ఇష్టంలేక సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ‘దంగల్’ సినిమా నటి జైరా వసీమ్ ప్రకటించడం సినీ, రాజకీయవర్గాల్లో దుమారం లేపింది. కొందరు జైరా వసీమ్ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం తప్పుపడుతున్నారు. తన జీవితం గురించి ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు జైరాకు ఉందనీ, దాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జైరా వ్యక్తిగత నిర్ణయాన్ని తాము గౌరవిస్తామనీ, మతానికి–కళకు ఏమాత్రం సంబంధం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. ఇస్లాం అసహనంతో కూడిన మతం అనేలా జైరా వ్యాఖ్యలు ఉన్నాయని శివసేన నేత ప్రియాంకా చతుర్వేది విమర్శించారు. అన్నీ ఇచ్చిన సినీపరిశ్రమకు కొందరు రుణపడి ఉండరనీ, అలాంటివాళ్లు తమ మ్రౌనంగా వెళ్లిపోవడం మంచిదని నటి రవీనా టాండన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment