Quit Acting
-
యాక్టింగ్‌కు గుడ్‌బై!.. నయనతార అభిమానుల్లో టెన్షన్..
సాక్షి, చెన్నై: మాలీవుడ్ టూ టాలీవుడ్ వయా కోలీవుడ్ అంటూ తన నట జీవితాన్ని అందమైన ప్రయా ణంగా మార్చుకున్న నయనతార తాజాగా బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టారు. గ్లామరస్ పాత్రలతో కెరీర్ ను ప్రారంభించి పెర్ఫార్మెన్స్ పాత్ర ల వరకు శభాష్ అని ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటున్న తార ఈ నయనతార. తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అంతేకాదు దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయకి ఈమెనే. ఇప్పుడు ఆమె అభిమానులను ఆందోళనకు గురి చేసే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నయనతార సినిమాల్లో సంపాదించినదంతా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నారు. ప్రస్తుతం భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న నయనతార త్వరలో నటనకు గుడ్‌బై చెప్పబోతుందన్నదే అభిమానులను కలతకు గురి చేస్తున్న వార్త. ఆమె నటనకు స్వస్తి చెప్పి తన ఇతర వ్యాపారాల వ్యవహారాలు చూసుకుంటూ జీవితాన్ని గడపాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే నటనకు గుడ్‌బై చెప్పినా నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంత? అని తెలియాలంటే నయనతార, విఘ్నేష్ శివన్ స్పందించాల్సి ఉంది. వాళ్లు ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్: ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన తారక్ -
సినిమాలకు హీరోయిన్ కాజల్ గుడ్‌బై చెప్పనుందా?
‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నప్పుడే 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడింది. ఇటీవలె మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ప్రస్తుతం మథర్‌వుడ్‌ని ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా కాజల్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. కొడుకు కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలని కాజల్ భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే సినిమాలను దూరం కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలతో కూడా చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తలపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక గంలో కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. -
అలా అయితే సినిమాలు మానేస్తా: కమల్ హాసన్
సాక్షి, కోయంబత్తూరు: ఒకవేళ తన రాజకీయ జీవితానికి సినిమాలు అడ్డంకి అయితే, వాటిని వదిలేస్తానని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ చెప్పారు. ఆయన ఆదివారం కోయంబత్తూరులో మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలన్నదే తన ఆశయమన్నారు. తాను రాజకీయాల్లో ప్రవేశించడం చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. దివంగత ఎంజీఆర్ ఎన్నో సినిమాల్లో ఎమ్మెల్యేగా నటించారని, రాజకీయాల్లో సీఎం పదవి చేపట్టి, ప్రజలకు సేవ చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక తాను రాజకీయాల నుంచి తప్పుకొని, మళ్లీ సినిమాలు చేసుకుంటానని చాలామంది అంచనా వేస్తున్నారని గుర్తుచేశారు. రాజకీయాల నుంచి ఎవరు తప్పుకుంటారో చూద్దామని, అది ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు. ఎన్నికల ప్రచార ఖర్చులను తాను నిజాయతీగా ఎన్నికల సంఘానికి తెలియజేశానని అన్నారు. అందుకు ఎన్నికల సంఘం అధికారులు తనను అభినందించారని చెప్పారు. -
జైరా వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం
న్యూఢిల్లీ: ఇస్లాంకు దూరం కావడం ఇష్టంలేక సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ‘దంగల్’ సినిమా నటి జైరా వసీమ్ ప్రకటించడం సినీ, రాజకీయవర్గాల్లో దుమారం లేపింది. కొందరు జైరా వసీమ్ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం తప్పుపడుతున్నారు. తన జీవితం గురించి ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు జైరాకు ఉందనీ, దాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జైరా వ్యక్తిగత నిర్ణయాన్ని తాము గౌరవిస్తామనీ, మతానికి–కళకు ఏమాత్రం సంబంధం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. ఇస్లాం అసహనంతో కూడిన మతం అనేలా జైరా వ్యాఖ్యలు ఉన్నాయని శివసేన నేత ప్రియాంకా చతుర్వేది విమర్శించారు. అన్నీ ఇచ్చిన సినీపరిశ్రమకు కొందరు రుణపడి ఉండరనీ, అలాంటివాళ్లు తమ మ్రౌనంగా వెళ్లిపోవడం మంచిదని నటి రవీనా టాండన్ అన్నారు. -
సినిమాలకు గుడ్‌బై
కెరీర్ ఎంత వీలుంటే అంత లాంగ్గా ఉండాలని కోరుకుంటారు ఆర్టిస్టులు. కానీ పది సినిమాలు కూడా చేయని జైరా వసీమ్ సినిమాల నుంచి తప్పుకుంటున్నాను అని సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ‘దంగల్’ సినిమాలో ఆమిర్ ఖాన్ కుమార్తె పాత్రలో హిందీ సినిమాలో కనిపించారు జైరా. ఆ తర్వాత ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ సినిమాలో నటించారు. ‘‘ఐదేళ్ల క్రితం నేను తీసుకున్న నిర్ణయం (యాక్టర్‌గా మారాలని) నా జీవితాన్ని మార్చేసింది. ఎంతో ప్రేమను, అభిమానాన్ని ఇచ్చింది. ఈ ఇండస్ట్రీకి నేను తగినదాన్ని అయినా ఇండస్ట్రీ నాకు తగదనిపిస్తోంది.. నా ప్రశాంతతను కోల్పోయే పని చేయదలుచుకోలేదు.. అందుకే ఇండస్ట్రీ నుంచి వైదొలగాలనుకుంటున్నాను’’ అని తెలిపారు. ఇది వరకూ జైరా వసీమ్ పలుమార్లు బెదిరింపులకు గురయ్యారు. దీంతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ఇండస్ట్రీ టాక్. -
మనోజ్ మనసు మార్చుకున్నాడా..?
బుధవారం ఉదయం నటనకు గుడ్ బై చెపుతున్నానంటూ తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన యంగ్ హీరో మంచు మనోజ్ సంచలనం సృష్టించాడు. హీరోగా స్టార్ ఇమేజ్ కోసం ఎంతో కష్టపడుతున్న మనోజ్ సడన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం పై ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కూడా షాక్ కి గురయ్యారు. అయితే మనోజ్ ఈ ప్రకటన వైరల్ కావటంతో కొద్ది సేపటికి మనోజ్ తన ట్విట్టర్ నుంచి నటనకు గుడ్ బై చెపుతున్నట్టుగా చేసిన ట్వీట్ ను డిలీట్ చేశాడు. దీంతో మనోజ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడని భావిస్తున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో మనోజ్ ట్విట్టర్ కూడా హ్యాక్ అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మనోజ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా కేవలం ట్వీట్ ను డిలీట్ చేయటంతో అభిమానులు.. అసలు కారణం ఏమై ఉంటుందన్న ఆలోచనలో పడ్డారు. ఈ సస్పెన్స్ కు తెర పడాలంటే మనోజ్ నుంచి క్లారిటీ రావాల్సిందే. -
యంగ్ హీరో షాకింగ్ డెసిషన్ : యాక్టింగ్‌కి గుడ్ బై
స్టార్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో మంచు మనోజ్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. బుధవారం తన సోషల్ మీడియా ద్వారా త్వరలో నటనకు గుడ్ బై చెప్పబోతున్నట్టుగా ప్రకటించాడు. ప్రస్తుతం ఎల్టీటీయి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఒక్కడు మిగిలాడు సినిమాలో నటిస్తున్న మనోజ్ ఆ తరువాత మరో సినిమా మాత్రమే చేస్తానని ప్రకటించాడు. నటుడిగా ఇవి నా చివరి చిత్రాలు అని ప్రకటించిన మనోజ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇతర రంగాల్లో కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే మంచు ఫ్యామిలీకి సంబంధించి మూడు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అదే బాటలో మనోజ్ కూడా నిర్మాతగా కొనసాగుతాడా..? లేన ఇతర రంగాల మీద దృష్టి పెడతాడా తెలియాల్సి ఉంది. తన ట్విట్టర్ ద్వారా సినిమాలకు గుడ్ బై చెపుతున్నట్టుగా ప్రకటించిన మనోజ్, కాసేపటికే ఆ ట్వీట్ ను డిలిట్ చేశాడు. దీంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడా..? లేక మనోజ్ అకౌంట్ కూడా హ్యక్ అయ్యిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై త్వరలో మనోజ్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.