
సాక్షి, కోయంబత్తూరు: ఒకవేళ తన రాజకీయ జీవితానికి సినిమాలు అడ్డంకి అయితే, వాటిని వదిలేస్తానని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్ చెప్పారు. ఆయన ఆదివారం కోయంబత్తూరులో మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలన్నదే తన ఆశయమన్నారు. తాను రాజకీయాల్లో ప్రవేశించడం చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. దివంగత ఎంజీఆర్ ఎన్నో సినిమాల్లో ఎమ్మెల్యేగా నటించారని, రాజకీయాల్లో సీఎం పదవి చేపట్టి, ప్రజలకు సేవ చేశారని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక తాను రాజకీయాల నుంచి తప్పుకొని, మళ్లీ సినిమాలు చేసుకుంటానని చాలామంది అంచనా వేస్తున్నారని గుర్తుచేశారు. రాజకీయాల నుంచి ఎవరు తప్పుకుంటారో చూద్దామని, అది ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు. ఎన్నికల ప్రచార ఖర్చులను తాను నిజాయతీగా ఎన్నికల సంఘానికి తెలియజేశానని అన్నారు. అందుకు ఎన్నికల సంఘం అధికారులు తనను అభినందించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment