
గెలిచాడనుకున్న నటుడు కమల్ హాసన్ చివరకు ఓటమిపాలయ్యాడు. బీజేపీ చేతిలో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పొందాడు.
చెన్నె: అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఓడిపోయాడు. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ (బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో ఎమ్‌ఎన్‌ఎం చీఫ్ కమల్‌హాసన్ ఓడిపోయారని ఎన్నికల సంఘం ప్రకటించింది.
బీజేపీ అభ్యర్థి వసతి శ్రీనివాసన్‌పై కమల్‌హాసన్ పరాజయం పొందాడు. కాగా కమల్‌మాసన్ పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి మూడో కూటమిగా ఏర్పడింది. మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్ ప్రకటించుకున్నారు. అయితే చివరకు ఆయన ఓడిపోవడం షాకింగ్‌కు గురి చేసే అంశం. ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన వారు 142 స్థానాల్లో పోటీ చేయగా వారందరూ పరాజయం పొందారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారం సొంతం చేసుకుంటోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ కన్నా అధిక స్థానాలు డీఎంకే సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కానున్నారు.
చదవండి: ఫ్యాన్ స్పీడ్‌కు కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ
చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం.. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్