ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ గొప్ప మనసు చాటుకున్నారు. వివాదంలో చిక్కుకొని ఉద్యోగం కోల్పోయిన మహిళా బస్డ్రై వర్‌కు మహిళకు కారును గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్యర్యపరిచారు. కొయంబత్తూర్‌కు చెందిన మహిళా డ్రైవర్ షర్మిలను కమల హాసన్ తన కార్యాలయానికి పిలిపించుకొని ‘కమల్ కల్చరల్ సెంటర్’ ద్వారా కారును బహుమతికి అందించారు. ఇప్పటివరకు ఉద్యోగిగా ఉన్న ఆమె.. ఇకపై ఎంతో మందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కొయంబత్తూర్ మహిళా బస్ డ్రైవర్ షర్మిల చుట్టూ ఇటీవల జరిగిన చర్చతో కలత చెందాను. తన వయసులోని ఎంతో మంది యువతకు ఆమె ఆదర్శం. షర్మిల కేవలం డ్రైవర్‌గా మాత్రమే ఉండిపోకూడదు. తనలాంటి అనేకమంది షర్మిలలను తీర్చిదిద్దాలని నేను ఆశిస్తున్నా. కమల్ కల్చరల్ సెంటర్ తరఫున ఆమెకు కారును అందిస్తున్నాం. దానిని ఆమెకు అద్దె సర్వీసుల కోసం వినియోగించుకోవచ్చు. అలాగే గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగి మరెందరికో ఉపాధి కల్పించాలని ఆశిస్తున్నా’ అని కమల్ పేర్కొన్నారు.
(చదవండి: రెచ్చిపోయిన దొంగలు.. గన్‌తో బెదిరించి.. కారును అడ్డగించి.. వీడియో వైరల్..)
కాగా, 24 ఏళ్ల షర్మిల కొయంబత్తూరులో తొలి మహిళా డ్రైవర్. గాంధీపురం నుంచి సోమనూర్ వరకు వ్రైవేటు సంస్థకు చెందిన బస్సును నడుపుతున్నారు. గతంలో బీజేపీ నేత వనతి శ్రీనివాసన్ ఈమె బస్సులో ప్రయాణించగా.. గత శుక్రవారం ఉదయం డీఎంకే ఎంపీ కనిమొళి.. షర్మిల నడిపిన ప్రైవేటు సంస్థకు చెందిన బస్సులో కోయంబత్తూరులోని గాంధీపురం నుంచి పీలమేడు వరకు ప్రయాణించారు.
అయితే, షర్మిల పబ్లిసిటీ మోజులో పడిందని ఆ బస్సు యాజమాన్యం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు బస్ కండక్టర్ మాటలు నమ్మి యాజమాన్యం తనను అవమానపర్చిందని, అందుకే కలల కొలువుకు దూరమైనట్టు షర్మిల మాట్లాడిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
(చదవండి: కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయిందా?.. అసలేం జరిగిందంటే..)
Coimbatore's first woman bus driver #Sharmila who quit her job after a controversy erupted over issuing of bus ticket to DMK MP Kanimozhi, has now been presented a new car by MNM leader #KamalHaasan to continue her journey as an entrepreneur. @IndianExpress pic.twitter.com/SyMS059KvS
— Janardhan Koushik (@koushiktweets) June 26, 2023
Comments
Please login to add a commentAdd a comment