
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు కమల్‌హాసన్ అధ్యక్షుడుగా ఉన్న మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) చవిచూసిన ఘోర పరాజయం ఆ పార్టీ బీటలు వారేలా చేసింది. ఉపాధ్యక్షుడు సహా మొత్తం కార్యవర్గం రాజీనామా చేసింది. తాజా ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గాను 154 స్థానాల్లో పోటీచేసిన ఎంఎన్‌ఎం మిగిలి న స్థానాలను కూటమి పార్టీలకు కేటాయించింది. ఇండియ జననాయక కట్చి కూటమికి సారథ్యం వహిస్తూ ముఖ్యమంత్రి అభ్యర్దిగా కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్‌హాసన్ బీజేపీ అభ్యర్ది చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతోపాటు ఆ పార్టీ అభ్యర్దులెవరూ గెలవలేదు. ఈ ఓటమిపై కమల్ వైఖరి ఎలా ఉన్నా పార్టీ శ్రేణు లు మాత్రం జీర్ణించుకోలేక పోయాయి. పార్టీ అధ్యక్షుడైన కమల్ సైతం ఓటమిపాలు కావడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు.
అనేక నియోజకవర్గాల్లో మక్కల్ నీది మయ్యం నాలుగో స్థానంలో నిలిచింది. ఓటమికి దారితీసిన కారణాలను విశ్లేషించుకునేందుకు కమల్ పార్టీ కార్యవర్గంతో ఈనెల 6వ తేదీ న సమావేశంకాగా, కార్యనిర్వాహక వర్గంలోని డాక్టర్ ఆర్ మహేంద్రన్ (ఉపాధ్యక్షుడు) సహా 10 మంది రాజీనామా లేఖలను కమల్‌కు సమర్పించా రు. పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోవడాన్ని నిరసి స్తూ ఉపాధ్యక్ష పదవితోపాటూ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు మహేంద్రన్ మీడియాకు చెప్పారు. ఈ నేపథ్యంలో కమల్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మహేంద్రన్ ఒక ద్రోహి అని దుయ్యబట్టారు. ‘ఓటమికి భయపడి పారిపోయే పిరికిపందలను పెద్దగా పట్టించుకోను. నా లక్ష్యంలో మార్పు లేదు, మాతృభూమి, ప్రజల కోసం ముందుకు సాగుతాం’అని స్పష్టం చేశారు. పరాజయ భారాన్ని మోయలేక రాజకీయా ల నుం చి కమల్ నిష్క్రమిస్తారని మక్కల్ నీది మయ్యం నేతలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment