యంగ్ హీరో షాకింగ్ డెసిషన్ : యాక్టింగ్కి గుడ్ బై | Manchu Manoj's Shocking Announcement | Sakshi
Sakshi News home page

యంగ్ హీరో షాకింగ్ డెసిషన్ : యాక్టింగ్కి గుడ్ బై

Jun 14 2017 12:03 PM | Updated on Sep 5 2017 1:37 PM

యంగ్ హీరో షాకింగ్ డెసిషన్ : యాక్టింగ్కి గుడ్ బై

యంగ్ హీరో షాకింగ్ డెసిషన్ : యాక్టింగ్కి గుడ్ బై

స్టార్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో మంచు మనోజ్

స్టార్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో మంచు మనోజ్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. బుధవారం తన సోషల్ మీడియా ద్వారా త్వరలో నటనకు గుడ్ బై చెప్పబోతున్నట్టుగా ప్రకటించాడు. ప్రస్తుతం ఎల్టీటీయి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఒక్కడు మిగిలాడు సినిమాలో నటిస్తున్న మనోజ్ ఆ తరువాత మరో సినిమా మాత్రమే చేస్తానని ప్రకటించాడు.

నటుడిగా ఇవి నా చివరి చిత్రాలు అని ప్రకటించిన మనోజ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇతర రంగాల్లో కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే మంచు ఫ్యామిలీకి సంబంధించి మూడు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అదే బాటలో మనోజ్ కూడా నిర్మాతగా కొనసాగుతాడా..? లేన ఇతర రంగాల మీద దృష్టి పెడతాడా తెలియాల్సి ఉంది. తన ట్విట్టర్ ద్వారా సినిమాలకు గుడ్ బై చెపుతున్నట్టుగా ప్రకటించిన మనోజ్, కాసేపటికే ఆ ట్వీట్ ను డిలిట్ చేశాడు. దీంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడా..? లేక మనోజ్ అకౌంట్ కూడా హ్యక్ అయ్యిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై త్వరలో మనోజ్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement