మనోజ్ మనసు మార్చుకున్నాడా..? | Manchu Manojs Shocking Announcement | Sakshi
Sakshi News home page

మనోజ్ మనసు మార్చుకున్నాడా..?

Published Wed, Jun 14 2017 12:13 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

మనోజ్ మనసు మార్చుకున్నాడా..?

మనోజ్ మనసు మార్చుకున్నాడా..?

బుధవారం ఉదయం నటనకు గుడ్ బై చెపుతున్నానంటూ తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన యంగ్ హీరో మంచు మనోజ్ సంచలనం సృష్టించాడు. హీరోగా స్టార్ ఇమేజ్ కోసం ఎంతో కష్టపడుతున్న మనోజ్ సడన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం పై ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కూడా షాక్ కి గురయ్యారు. అయితే మనోజ్ ఈ ప్రకటన వైరల్ కావటంతో కొద్ది సేపటికి మనోజ్ తన ట్విట్టర్ నుంచి నటనకు గుడ్ బై చెపుతున్నట్టుగా చేసిన ట్వీట్ ను డిలీట్ చేశాడు.

దీంతో మనోజ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడని భావిస్తున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో మనోజ్ ట్విట్టర్ కూడా హ్యాక్ అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మనోజ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా కేవలం ట్వీట్ ను డిలీట్ చేయటంతో అభిమానులు.. అసలు కారణం ఏమై ఉంటుందన్న ఆలోచనలో పడ్డారు. ఈ సస్పెన్స్ కు తెర పడాలంటే మనోజ్ నుంచి క్లారిటీ రావాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement