
రవీనా టాండన్
‘కేజీయఫ్’ చాప్టర్ 1 దేశవ్యాప్తంగా సూపర్ సక్సెస్ సాధించడంతో, సెకండ్ పార్ట్‌ను ఇంకా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్టున్నారు చిత్రనిర్మాతలు. బాలీవుడ్ తారలను కూడా తారాగణంగా తీసుకొని మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. ఆల్రెడీ సంజయ్‌దత్‌ను ముఖ్యపాత్ర కోసం సంప్రదించిన విషయం తెలిసిందే. లేటెస్ట్‌గా రవీనా టాండన్‌ను కూడా ఓ కీలకపాత్రలో నటించమని కోరారట ‘కేజీయఫ్’ బృందం. మరి ఈ రోల్‌కు రవీనా యస్ అంటారో నో అంటారో తెలియాలి. 1999లో ఉపేంద్రతో చేసిన ‘ఉపేంద్ర’ రవీనా టాండన్ చివరి కన్నడచిత్రం. మరి 20 ఏళ్ల తర్వాత కన్నడకు కమ్‌బ్యాక్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. ఇంతకీ ‘కేజీయఫ్’లో నటించిన యశ్‌కు బోలెడంత పాపులార్టీ వచ్చిన విషయం తెలిసిందే. చిత్రదర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం రెండో భాగం పనులతో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment