
అజయ్ దేవగన్,ఆలియా భట్
‘గంగూభాయ్ కతియావాడి’ అనే గ్యాంగ్‌స్టర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. గంగూభాయ్ పాత్రలో ఆలియా భట్ నటించనున్నారు. 1960లో ముంబైలో ఓ బ్రోతల్ ఏరియాలో జరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఆలియా కనిపిస్తారు. ఆలియా జీవితంలో కీలకంగా మారే ప్రియుడి పాత్రలో అజయ్ దేవగన్ నటించనున్నారని బాలీవుడ్ టాక్. గంగూభాయ్ పవర్‌ఫుల్‌గా మారడానికి అజయ్ ఎలా సపోర్ట్ చేశారనే అంశం ఆసక్తికరంగా ఉంటుందని టాక్. వచ్చే ఏడాది దీపావళికి ఈ చిత్రం విడుదల కానుంది. 20 ఏళ్ల తర్వాత (హమ్ దిల్ దే చుకే సనమ్, 1999) సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అజయ్ దేవగన్ నటించనుండటం విశేషం.