బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. గంగూబాయి జీవితం ఆధారంగా రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ అనే పుస్తకాన్ని బేస్ చేసుకుని ఆమె జీవిత కథనే సినిమాగా తెరకెక్కించారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆలియా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ ఏడాది అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రాల్లో ఒటికగా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.
(చదవండి: అభిమాని కాళ్లు మొక్కిన హృతిక్ రోషన్, వీడియో వైరల్)
లేటేస్ట్ సమాచారం ప్రకారం ఆస్కార్ బరిలో గంగూబాయి కతియావాడి సినిమా ఉందట. భారతీయ సినిమాల నుంచి గంగూబాయి కతియావాడి పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి విదేశాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో.. ‘గంగుబాయి’ని కచ్చితంగా ఆస్కార్ బరిలోకి దింపుతారని బాలీవుడ్ మీడియా పేర్కొంటుంది. మరో రెండు నెలల్లో ఆస్కార్ చిత్రాల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గంగూబాయి కతియావాడి కాకుండా.. ఆర్ఆర్ఆర్ , ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాలు కూడా ఆస్కార్ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment