
అజయ్ దేవగన్
అజయ్ దేవగన్ హైదరాబాదీలా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఉర్దూ యాసలో డైలాగ్స్ పలికితే ఎలా ఉంటుంది? సూపర్ కదా. ప్రస్తుతం ఆయన దాని కోసమే శిక్షణ తీసుకుంటున్నారట. తన లేటెస్ట్ సినిమా కోసమే ఇదంతా. ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయద్ అబ్దుల్ రహీమ్ పాత్రలో అజయ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. అమిత్ శర్మ దర్శకత్వంలో జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా, జోయ్ సేన్ గుప్తా నిర్మించనున్నారు. సయద్ రహీమ్ హైదరాబాదీ. సో.. ఆయన పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడానికి ఉర్దూ నేర్చుకుంటున్నారట అజయ్. రహీమ్ ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్‌గా చేసిన పదకొండేళ్ల ప్రాంతంలో ఈ సినిమా కథ నడుస్తుందట.
Comments
Please login to add a commentAdd a comment