రకుల్‌ప్రీత్ సింగ్
నో రెస్ట్. హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌కి ఈ సండే నో రెస్ట్. ఎందుకంటే ఆమె షూటింగ్‌లో పాల్గొన్నారు. కార్తీతో చేస్తున్న తమిళ సినిమా కోసం, అజయ్ దేవగన్‌తో చేస్తోన్న హిందీ సినిమా కోసం చెన్నై, ముంబైల మధ్య చక్కర్లు కొడుతున్నారీ బ్యూటీ. అకీవ్ అలీ దర్శకత్వంలో రూపొందుతోన్న హిందీ సినిమా సెకండ్ షెడ్యూల్‌ని ముంబైలో కంప్లీట్ చేశారామె.
ఈ షెడ్యూల్‌లో పాల్గొనడానికి ముందే చెన్నైలో కార్తీ హీరోగా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా నైట్ షూట్‌లో పాల్గొన్నారు రకుల్. ఇప్పుడు మళ్లీ ఇదే సినిమా షూటింగ్ కోసం ముంబై నుంచి చెన్నై వెళ్లారట ఈ బ్యూటీ. ఈ సినిమా షూటింగ్‌ను యూరప్, హిమాలయాస్, యూకేలలో కూడా చిత్రీకరించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని టాక్. ఈ సండే ఈ సినిమా షూటింగ్‌లోనే రకుల్ ప్రీత్‌సింగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment