ఆ రెండింటి మధ్య నిజం ఉంటుంది.. థ్రిల్లింగ్‌గా 'రన్‌వే 34' ట్రైలర్‌ | Runway 34 Movie Trailer: Amitabh Bachchan Ajay Devgn Promising Acting | Sakshi
Sakshi News home page

Runway 34 Movie Trailer: 'రన్‌వే 34' ట్రైలర్‌ విడుదల..

Published Mon, Mar 21 2022 3:48 PM | Last Updated on Mon, Mar 21 2022 3:52 PM

Runway 34 Movie Trailer: Amitabh Bachchan Ajay Devgn Promising Acting - Sakshi

Runway 34 Movie Trailer: Amitabh Bachchan Ajay Devgn Promising Acting: బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌, అజయ్ దేవగన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్, ఆకాంక్ష సింగ్‌ నటిస్తున్న చిత్రం 'రన్‌వే 34'. నిజ జీవితపు సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అజయ్‌ దేవగన్ దర్శకత్వం వహించారు. ఇంతకుముందు 2008లో వచ్చిన 'యూ మే ఔర్‌ హమ్‌', 2016లో వచ్చిన 'శివాయ్‌' చిత్రాల తర్వాత అజయ్ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఈ సినిమా నుంచి వచ్చిన యాక్టర్స్‌ ఫస్ట్‌లుక్‌లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికగా 'ప్రతీ సెకండ్‌ కౌంట్స్‌.. రన్‌ వే 34 ట్రైలర్‌ను విడదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది. టేకాఫ్‌ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం' అంటూ ట్రైలర్‌ను షేర్‌ చేశాడు అజయ్‌ దేవగన్‌. 

ట్రైలర్ ప్రారంభంలో అజయ్‌ దేవగన్‌ నో స్మోకింగ్‌ జోన్‌లో సిగరెట్‌ పట్టుకుని కనిపిస్తాడు. ఇందులో అజయ్‌ దేవగన్‌ పైలట్‌గా, రకుల్‌ కోపైలట్‌గా కనువిందు చేయనున్నారు. ఒక భయంకరమైన సంఘటన నుంచి ప్రయాణీకులను ఆ విమాన పైలట్‌లు ఎలా కాపాడరన్నదే కథాంశంగా ట్రైలర్‌ ఉంది. ఇందులో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్‌ ఆఫిసర్‌గా అమితాబ్‌ బచ్చన్‌ ఆకట్టుకున్నారు. 'చేసిన తప్పు ఒప్పుకోవడంలోనే మనిషి క్యారెక్టర్‌ తెలుస్తుంది', 'అసలేం జరిగింది.. ఎలా జరిగింది అనే విషయాల మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. అదే నిజం' వంటి డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌ చూస్తుంటే ఒక ప్రమాదపు సంఘటన కథాంశంతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'అజయ్‌ దేవగన్‌ ఎఫ్‌ఫిల్మ్స్‌' సమర్పణలో అజయ్‌ దేవగన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement