Rakul Preet Singh About Working With Amitabh Bachchan Ajay Devgn: టాలీవుడ్లో అతికొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఫిట్నెస్ బ్యూటీ నటించిన తాజా హిందీ చిత్రం 'రన్ వే 34'. ఈ మూవీలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ మూవీకి అజయ్ దేవగణ్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విశేషాలను ఇటీవల పంచుకుంది రకుల్.
ఈ క్రమంలో రకుల్‌ను ఒకేసారి ఇద్దరు పెద్ద స్టార్లతో పని చేయడం నటిగా కష్టమనిపించిందా ? అని ప్రశ్నించగా ఆసక్తికర సమధానం ఇచ్చింది. నిజానికి కష్టం అనే మాటే నాకు అస్సలు నచ్చదు. నాకంటే ప్రతిభావంతులైన నటులతో కలిసి పనిచేస్తున్నప్పుడు నాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇక ఇద్దరు పెద్ద స్టార్లతో కలిసి నటిస్తున్నాన్నంటే ఆ ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. ఎందుకంటే నేను మరింత మెరుగ్గా, బెస్ట్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ ఛత్రివాలీ, డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్ చిత్రాల్లో నటిస్తోంది.
చదవండి: ఆ స్టార్ హీరోకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ ?
Rakul Preet Singh: ఆ మాటే నాకు నచ్చదు: రకుల్ ప్రీత్ సింగ్
Published Mon, May 2 2022 7:42 PM | Last Updated on Mon, May 2 2022 7:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment